తుడుచుకోవడమే బెస్ట్!
ABN , First Publish Date - 2020-05-13T16:52:14+05:30 IST
చేతులు సబ్బుతో శుభ్రం చేసుకున్నాక కొందరు డ్రయ్యర్‌తో ఆరబెట్టుకుంటారు. అయితే డ్రయ్యర్ కన్నా టిష్యూ పేపర్స్‌ను ఉపయోగించడం లేదా పొడి బట్టతో తుడుచుకోవడం వల్ల ఉత్తమమైన ఫలితం ఉంటుంది.

ఆంధ్రజ్యోతి(13-05-2020):
చేతులు సబ్బుతో శుభ్రం చేసుకున్నాక కొందరు డ్రయ్యర్‌తో ఆరబెట్టుకుంటారు. అయితే డ్రయ్యర్ కన్నా టిష్యూ పేపర్స్‌ను ఉపయోగించడం లేదా పొడి బట్టతో తుడుచుకోవడం వల్ల ఉత్తమమైన ఫలితం ఉంటుంది.
బ్రిటన్ యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్, లీడ్స్ టీచింగ్ హాస్పిటల్స్‌కు చెందిన పరిశోధకుల అధ్యయనంలో ఈ విషయం తేలింది. సరైన పద్ధతిలో చేతులు శుభ్రం చేసుకోకపోయినా, టిష్యూ పేపర్‌తో క్లీన్ చేసుకున్నప్పుడు వైరస్ పూర్తిగా తొలగిపోతున్నట్టు పరిశోధకులు గుర్తించారు.