గుండె సమస్యలకు సూచన కావచ్చు!

ABN , First Publish Date - 2020-07-28T18:14:49+05:30 IST

డాక్టర్‌! నా వయసు 32 ఏళ్లు. గత రెండేళ్ల నుంచి మధుమేహం ఉంది. అయితే గత ఏడాదిగా అంగస్తంభన సమస్య ఎదుర్కొంటున్నాను

గుండె సమస్యలకు సూచన కావచ్చు!

ఆంధ్రజ్యోతి(28-07-2020)

ప్రశ్న: డాక్టర్‌! నా వయసు 32 ఏళ్లు. గత రెండేళ్ల నుంచి మధుమేహం ఉంది. అయితే గత ఏడాదిగా అంగస్తంభన సమస్య ఎదుర్కొంటున్నాను. వైద్యులు పినైల్‌ డాప్లర్‌ టెస్ట్‌ సూచించారు. ఈ పరీక్షతో అసలు సమస్యను కనిపెట్టవచ్చా?


డాక్టర్ సమాధానం: పినైల్‌ డాప్లర్‌ టెస్ట్‌తో అంగంలోని సూక్ష్మ రక్తనాళాలలో అడ్డంకుల కారణంగా అంగస్తంభన సమస్య తలెత్తిందా లేదా అనేది నిర్ధారించుకోవచ్చు. అలాగే ఈ పరీక్షతో మీకున్న సమస్య మానసికమైనదా, శారీరకమైనదా అనేదీ తేలుతుంది. ఒకవేళ రక్తనాళాల్లో ఇబ్బందులు ఉంటే మందులతో సరిదిద్దవచ్చు. అయితే మీకు ఇంత చిన్న వయసులోనే అంగంలోని రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడ్డాయంటే, మున్ముందు గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళాల్లోనూ అడ్డంకులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ సమస్యను నియంత్రించే జాగ్రత్తలు ఇప్పటినుంచే మొదలుపెట్టాలి. వైద్యుల సూచన మేరకు పినైల్‌ డాప్లర్‌ పరీక్ష చేయించుకోండి. ఈ పరీక్ష ఎంతో సురక్షితమైనది. రెండు విధాలా ప్రయోజనకరమైనది.


-డాక్టర్‌ రాహుల్‌ రెడ్డి, ఆండ్రాలజిస్ట్‌

జూబ్లీహిల్స్‌, హైదరాబాద్‌

8332850090 (కన్సల్టేషన్‌ కోసం)

Read more