లోపం ఎవరిది?

ABN , First Publish Date - 2020-07-07T18:15:56+05:30 IST

డాక్టర్‌! అమెరికాలో ఉండే మా అమ్మాయి, అల్లుడు లాక్‌డౌన్‌కు ముందు మా దగ్గరకు వచ్చారు. వాళ్లకు పెళ్లై ఇప్పటికి మూడేళ్లు. అయితే అల్లుడు.. అమ్మాయికి ఇప్పటివరకూ శారీరకంగా చేరువ కాలేదని మా కూతురి

లోపం ఎవరిది?

ఆంధ్రజ్యోతి(07-07-2020)

ప్రశ్న: డాక్టర్‌! అమెరికాలో ఉండే మా అమ్మాయి, అల్లుడు లాక్‌డౌన్‌కు ముందు మా దగ్గరకు వచ్చారు. వాళ్లకు పెళ్లై ఇప్పటికి మూడేళ్లు. అయితే అల్లుడు.. అమ్మాయికి ఇప్పటివరకూ శారీరకంగా చేరువ కాలేదని మా కూతురి మాటల ద్వారా తెలిసింది. పెళ్లైన కొత్తలో చేరువ అయినా, ఆ తర్వాత నుంచి దూరంగా ఉండిపోయాడనీ, ఇప్పటివరకూ కలవలేదనీ అమ్మాయి అంటోంది. ఈ మధ్య కాలంలో అమ్మాయి చొరవ తీసుకుని దగ్గరకు వెళ్లినా, అతను నిరాసక్తత చూపుతున్నాడని అంటోంది. అతనికి వైద్య పరీక్షలు చేయించి, పరిస్థితిని న్ధిరించుకుందామంటే, లాక్‌డౌన్‌ మూలంగా వైద్యులు పరీక్షిస్తారో, లేదో అనే అనుమానం ఉంది. మమ్మల్ని ఏం చేయమంటారు?


-  ఓ సోదరి, హైదరాబాద్‌ 


డాక్టర్ సమాధానం: మీ అమ్మాయి చెప్పిన మాటలను బట్టి లోపం అల్లుడిలోనే ఉందని మీరు నిర్ధారణకు వచ్చినట్టు అర్థమవుతోంది. కానీ లోపం మీ అమ్మాయిలో కూడా ఉండి ఉండవచ్చు. ప్రారంభంలో అతను శారీరకంగా చేరువ అయ్యే ప్రయత్నం చేశాడని అంటున్నారు కాబట్టి అతనిలో సమస్య ఉండి ఉండకపోవచ్చు. సాధారణంగా కొంతమంది అమ్మాయిల్లో సెక్స్‌ పట్ల అర్థం లేని భయాలు ఉంటాయి. దాంతో భర్త చేరువైనప్పుడు కుంచించుకుపోతారు. అంగప్రవేశ సమయంలో యోని కండరాలు కుంచించుకుపోయి సెక్స్‌ కష్టం కావచ్చు. ఈ సమస్యను వైద్యపరిభాషలో వెజైనిస్మస్‌ అంటారు. అలా పదే పదే ప్రయత్నించి, విసిగిపోయిన పురుషులకు భార్య పట్ల ఆసక్తి సన్నగిల్లడం సహజం. దాంతో భార్యను దూరం పెట్టేస్తారు. ఆ తర్వాత కొంతకాలానికి మీ అమ్మాయి, తనంతట తానుగా చేరువ అయినా, అంతిమంగా సెక్స్‌ సంభవించే పరిస్థితి ఉండదు కాబట్టి అతను దూరం పెట్టి ఉండవచ్చు. కాబట్టి నిజం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. లాక్‌డౌన్‌ కారణంగా సర్జరీలు ఆగిపోయిన మాట వాస్తవమే! కానీ వైద్య పరీక్షలు యథాతథంగా జరుగుతున్నాయి. కాబట్టి మీ అమ్మాయి, అల్లుడికి వైద్య పరీక్షలు జరిపించండి. వెజైనిస్మస్‌ సమస్యను కౌన్సెలింగ్‌తో సరిదిద్దవచ్చు. ఈ సమస్య పరిష్కారమైతే, మీ అమ్మాయి, అల్లుడి దాంపత్య జీవితం ఫలవంతంగా సాగుతుంది. 


- డాక్టర్‌ రాహుల్‌ రెడ్డి,

ఆండ్రాలజిస్ట్‌, హైదరాబాద్‌

8332850090 (కన్సల్టేషన్‌ కోసం)

Read more