కరోనాను చంపే డ్రగ్?
ABN , First Publish Date - 2020-04-07T14:43:31+05:30 IST
కరోనాను సంహరించే మందు లేదా వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా పలు ప్రయోగాలు, అధ్యయనాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా వాడుకలో ఉన్న యాంటీవైరల్ డ్రగ్ ‘ఐవర్‌మెక్టిన్’ కణంలో కరోనా వైరస్ పెరుగుదలను నియంత్రిస్తుందని

ఆంధ్రజ్యోతి(07-04-2020)
కరోనాను సంహరించే మందు లేదా వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా పలు ప్రయోగాలు, అధ్యయనాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా వాడుకలో ఉన్న యాంటీవైరల్ డ్రగ్ ‘ఐవర్‌మెక్టిన్’ కణంలో కరోనా వైరస్ పెరుగుదలను నియంత్రిస్తుందని ‘యాంటీవైరల్ రీసెర్చ్’ అనే ఆస్ర్టేలియాకు చెందిన ఓ జర్నల్ ప్రచురించింది. ‘‘కణంలోకి ప్రవేశించిన మొత్తం కరోనా ఆర్.ఎన్.ఎను ఈ డ్రగ్ 48 గంటల్లో తొలగించగలుగుతుందని ఆస్ట్రేలియా మొనాష్ యూనివర్శిటీకి చెందిన కైలీ వాంగ్‌స్టాఫ్ చెప్పారు. ఐవర్‌మెక్టిన్ అనే ఈ యాంటీపారసైటిక్ డ్రగ్ డెంగ్యూ, ఇన్‌ఫ్లూయెంజా, జికా వైర్‌సలను సమర్థంగా నిర్మూలించే ప్రభావం కలిగి ఉందని నిరూపణ అయింది. అయితే ఇప్పటివరకూ ఇన్‌విట్రో పరీక్షల ద్వారా మాత్రమే ఈ విషయం నిరూపణ అయింది.
ఈ దశ దాటి మనుషుల మీద ప్రయోగాలు చేసిన తర్వాతే ఈ డ్రగ్ కరోనాను కూడా అంతే సమర్థంగా నిర్మూలించగలదో, లేదో తెలుసుకోగలం అంటున్నారు డాక్టర్ వాంగ్‌స్టాఫ్. పాండెమిక్‌గా మారిన కరోనా వైరస్, దాన్ని సంహరించే మందుల లభ్యత లేని ప్రస్తుత పరిస్థితుల్లో, ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఈ డ్రగ్ ప్రభావం నిరూపణ అయిన పక్షంలో, కరోనా మీద తక్షణమే విజయం సాధించవచ్చు అని కూడా అంటున్నారాయన.