వివిధ సంస్థల్లో ఉద్యోగాలు

ABN , First Publish Date - 2020-06-06T21:05:09+05:30 IST

ఆరావళి పవర్‌ కంపెనీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఏపీసీపీఎల్‌) - గేట్‌ 2019 స్కోరు ద్వారా ఇంజనీరింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీల నియామకానికి ప్రకటన విడుదల చేసింది.

వివిధ సంస్థల్లో ఉద్యోగాలు

ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీలు

ఆరావళి పవర్‌ కంపెనీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఏపీసీపీఎల్‌) - గేట్‌ 2019 స్కోరు ద్వారా ఇంజనీరింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీల నియామకానికి ప్రకటన విడుదల చేసింది.

ఖాళీలు: 25

విభాగాలవారీ ఖాళీలు: ఎలక్ట్రికల్‌ 8, మెకానికల్‌ 12, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ 5

అర్హత: 65 శాతం మార్కులతో సంబంధిత ఇంజనీరింగ్‌ విభాగంలో బీఈ/బీటెక్‌ పూర్తిచేసి ఉండాలి. 

వయసు: 27 ఏళ్లు మించకూడదు.

ఎంపిక: గేట్‌ 2019 స్కోరు, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ ద్వారా

దరఖాస్తు ఫీజు: రూ.150

దరఖాస్తుకు ఆఖరు తేదీ: జూలై 3

వెబ్‌సైట్‌: www.apcpl.co.inఅసిస్టెంట్‌ మేనేజర్లు

సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా అసిస్టెంట్‌ మేనేజర్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఖాళీలు: 147

విభాగాలు: జనరల్‌ 80, లీగల్‌ 34, ఐటీ 22, ఇంజనీరింగ్‌ 5, రీసెర్చ్‌ 5, అఫీషియల్‌ లాంగ్వేజ్‌ 1

వయసు: 30 ఏళ్లు మించకూడదు

అర్హత: బీఈ / బీటెక్‌ / లా డిగ్రీ / సీఏ / సీఎ్‌ఫఏ / సీఎస్‌ / పీజీ ఉత్తీర్ణత

ఎంపిక: ఆన్‌లైన్‌ ఎగ్జామ్స్‌, ఇంటర్వ్యూ ద్వారా      

దరఖాస్తు ఫీజు: రూ.1000

దరఖాస్తుకు ఆఖరు తేదీ: జూలై 31

వెబ్‌సైట్‌: www.sebi.gov.inకలికిరి సైనిక్‌ స్కూల్‌

చిత్తూరు జిల్లా కలికిరిలోని సైనిక్‌ స్కూల్‌ తాత్కాలిక ప్రాతిపదికన ట్రైనింగ్‌ స్టాఫ్‌ నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.

ఉద్యోగాలు: ఇన్‌స్ట్రక్టర్‌ 1, గ్రూమర్‌ 3

అర్హత: ఇన్‌స్ట్రక్టర్‌కు ఇంటర్‌ లేదా తత్సమాన అర్హత ఉండాలి. హార్స్‌ రైడింగ్‌ తెలిసి ఉండాలి. రిసాల్దార్‌ కోర్సు చేసి ఉండాలి.  హార్స్‌ రైడింగ్‌ ఇన్‌స్ట్రక్టర్‌గా రెండేళ్ల అనుభవం తప్పనిసరి. గ్రూమర్‌ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. హార్స్‌ గ్రూమర్‌గా ఏడాదిపాటు పనిచేసిన అనుభవం ఉండాలి.

వయసు: ఇన్‌స్ట్రక్టర్‌కు 21 నుంచి 35 ఏళ్ల మధ్య, గ్రూమర్‌కు 21 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. 

ఎంపిక: అభ్యర్థుల అర్హతలను పరిశీలించి షార్ట్‌లిస్ట్‌ చేసి ఇంటర్వ్యూకి పిలుస్తారు.

దరఖాస్తుకు ఆఖరు తేదీ: జూన్‌ 24

చిరునామా: ప్రిన్సిపాల్‌, సైనిక్‌ స్కూల్‌ కలికిరి, చిత్తూరు - 517234

వెబ్‌సైట్‌: www.kalikirisainikschool.com

Updated Date - 2020-06-06T21:05:09+05:30 IST