వివిధ సంస్థల్లో ఉద్యోగాలకు దరఖాస్తులు
ABN , First Publish Date - 2020-05-29T17:21:02+05:30 IST
విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ (ఆప్కాబ్) ప్రొఫెషనల్ కన్సల్టెంట్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఆప్కాబ్‌లో కన్సల్టెంట్ ఉద్యోగాలు
విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ (ఆప్కాబ్) ప్రొఫెషనల్ కన్సల్టెంట్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: ఇంజనీరింగ్ / మేనేజ్‌మెంట్ / కామర్స్ విభాగాల్లో డిగ్రీ / పీజీ పూర్తిచేసి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం, తెలుగుభాషలో ప్రావీణ్యం తప్పనిసరి. కనీసం 15 ఏళ్లు ప్రముఖ బ్యాంకులు / ఆర్థిక సంస్థల్లో ఆఫీసర్‌గా పనిచేసిన అనుభవం అవసరం.
వయసు: 65 ఏళ్లు మించకూడదు
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
వేతనం: రూ.75,000
దరఖాస్తు ఫీజు: రూ.500
దరఖాస్తుకు ఆఖరు తేదీ: జూన్ 9
వెబ్‌సైట్: www.apcob.org
ఆచార్య రంగా ’వర్సిటీలో జాబ్స్
ఆచార్య ఎన్.జి. రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలోని రీజనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్ (ఆర్‌ఏఆర్‌ఎస్) - గ్రామీణ్ కృషి మౌసమ్ సేవా స్కీమ్ కోసం ‘రీసెర్చ్ అసోసియేట్’ నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: పీజీ - అగ్రికల్చర్ (ఆగ్రో మెటీరియాలజీ / ఆగ్రోనమీ స్పెషలైజేషన్) ఉత్తీర్ణులై ఉండాలి. సైన్స్ ఇండెక్స్‌డ్ జర్నల్‌కు రీసెర్చ్ పేపర్ సమర్పించి ఉండాలి. పరిశోధన / బోధన రంగాల్లో కనీసం మూడేళ్ల అనుభవం అవసరం. పీహెచ్‌డీ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.
వయసు: పురుషులకు 40 ఏళ్లు, మహిళలకు 45 ఏళ్లు మించకూడదు.
వేతనం: హెచ్‌ఆర్‌ఏ సహా నెలకు రూ.47,000
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
ఇంటర్వ్యూ: జూన్ 5న
ఆసక్తిగల అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, బయోడేటాతో ఇంటర్వ్యూకి హాజరవ్వాలి.
ఇంటర్వ్యూ ప్రదేశం: రీజనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్, అనకాపల్లి.
వెబ్‌సైట్: www.angrau.ac.in
తిరుపతిలోని ఐఐఎస్ఈఆర్‌లో ఫెలోషిప్‌నకు దరఖాస్తులు
తిరుపతిలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్) పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్ ఫెలోషి్‌పనకు దరఖాస్తులు కోరుతోంది.
విభాగాలు: మేథమెటిక్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ
అర్హత: పీహెచ్‌డీ పూర్తయిన తరవాత రెండేళ్ల పరిశోధన అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఫెలోషిప్: హెచ్‌ఆర్‌ఏ సహా నెలకు రూ.47,000 ఇస్తారు. పీహెచ్‌డీ డిగ్రీ కోసం ఎదురుచూస్తున్నవారికి హెచ్‌ఆర్‌ఏ సహా రూ.35,000 ఇస్తారు.
ఎంపిక: పరిశోధన అనుభవం, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తుకు ఆఖరు తేదీ: జూన్ 10
వెబ్‌సైట్: www.iisertirupati.ac.in