ఐఐటీలో ఫెలోషిప్‌నకు దరఖాస్తులు
ABN , First Publish Date - 2020-06-11T18:21:21+05:30 IST
రూర్కీలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఎలకా్ట్రనిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో జూనియర్ రీసెర్చ్ ఫెలోషి్‌పనకు దరఖాస్తులు కోరుతోంది.

ఐఐటీలో జేఆర్‌ఎఫ్
రూర్కీలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఎలకా్ట్రనిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో జూనియర్ రీసెర్చ్ ఫెలోషి్‌పనకు దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: ఎంటెక్ (వైర్‌లెస్ కమ్యూనికేషన్) ఉత్తీర్ణులై ఉండాలి. గేట్ అర్హత ఉండాలి.
జేఆర్‌ఎఫ్ వ్యవధి: ఏడాది
ఫెలోషిప్: నెలకు రూ.31,000
ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: జూన్ 24
వెబ్‌సైట్: www.iitr.ac.in
క్లినికల్ సైంటిస్ట్ స్కీమ్
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) - నర్చరింగ్ క్లినికల్ సైంటిస్ట్స్ స్కీమ్ 2020 ప్రకటన విడుదల చేసింది.
అర్హత: 60 శాతం మార్కులతో ఎంబీబీఎస్ / బీడీఎస్ ఉత్తీర్ణులైనవారు అర్హులు. ఎంసీఐ / డీసీఐ గుర్తింపు ఉండాలి.
వయసు: 32 ఏళ్లు మించకూడదు.
ఫెలోషిప్: నెలకు రూ.లక్ష. పరిశోధనల నిమిత్తం కంటింజెన్సీ గ్రాంట్ ఇస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: జూన్ 30
వెబ్‌సైట్:main.icmr.nic.in