1873 పోస్టులకు 98 వేల దరఖాస్తులు

ABN , First Publish Date - 2020-08-18T20:08:20+05:30 IST

జిల్లా సచివాలయాల్లో మిగిలిన పోస్టుల భర్తీకి ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం రెండోవిడత నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మార్చిలో జరగాల్సిన రాతపరీక్ష స్థానికసంస్థల ఎన్నికలతో

1873 పోస్టులకు 98 వేల దరఖాస్తులు

సచివాలయ ఉద్యోగాలకు వచ్చేనెల 20 నుంచి పరీక్షలు   

చిత్తూరు(ఆంధ్రజ్యోతి): జిల్లా సచివాలయాల్లో మిగిలిన పోస్టుల భర్తీకి ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం రెండోవిడత నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మార్చిలో జరగాల్సిన రాతపరీక్ష స్థానికసంస్థల ఎన్నికలతో వాయుదా పడింది. కరోనా విజృంభణతో ఆగస్టు 9న నిర్వహించాల్సిన రాతపరీక్ష, వచ్చేనెల 20న నిర్వహించేందుకు ప్రభుత్వ నిర్ణయించింది. ఆ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో కార్యదర్శి, వార్డు హెల్త్‌ సెక్రటరీ మినహా 1873 పోస్టులను భర్తీ జరగనుంది. ఇందుకు గాను 98,364 మంది నిరుద్యోగులు దరఖాస్తు చేయగా, ఒక్కో పోస్టుకు 52 మంది పోటీ పడుతున్నారు.    వీటిలో అత్యధికంగా 692 విలేజ్‌ అనిమల్‌ హస్బెండరీ అసిస్టెంట్‌ పోస్టులు, అత్యల్పంగా రెండు ఫిషరీస్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 18 రకాల పోస్టులకుగాను ఒకే రాత పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇందులో అర్హత సాధిస్తే ఇంటర్వూ లేకుండానే ఉద్యోగం పొందే అవకాశం ఉండడం నిరుద్యోగులను ఊరిస్తోంది. కాగా, పశుసంవర్ధక శాఖలో సహాయకుడి పోస్టుకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా అర్హత కలిగిన అభ్యర్థులు పెద్దగా లేకపోవడంతో తక్కువగా దరఖాస్తులందాయి. ఆ మేరకు జిల్లాలో 692 పోస్టులుండగా 273 మంది దరఖాస్తు చేశారు.    అయితే ఇదే అర్హతతో ప్రత్యామ్నాయ కోర్సులు చేసిన అభ్యర్థులకు అవకాశం కల్పించే విషయమై ఉన్నతాధికారులు ఆలోచిస్తున్నారు. మొదటి విడత భర్తీలో పెద్దఎత్తున పోస్టులు మిగిలినా, ప్రభుత్వం విద్యార్హతల సడలింపు విషయమై దృష్టిసారించక పోవడం విమర్శలకు దారితీస్తోంది. 


Updated Date - 2020-08-18T20:08:20+05:30 IST