నేషనల్‌ టెస్ట్‌ అభయాస్‌ యాప్‌లో 30 లక్షల ఉచిత ఆన్‌లైన్‌ టెస్ట్‌లు

ABN , First Publish Date - 2020-07-22T20:16:52+05:30 IST

జెఇఇ మెయిన్‌, నీట్‌ సహా వివిధ పోటీ పరీక్షలను నిర్వహిస్తున్న నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ఆరంభించిన యాప్‌ ‘నేషనల్‌ టెస్ట్‌ అభయా్‌స’లో 30 లక్షల మేరకు ఆన్‌లైన్‌

నేషనల్‌ టెస్ట్‌ అభయాస్‌ యాప్‌లో 30 లక్షల ఉచిత ఆన్‌లైన్‌ టెస్ట్‌లు

జెఇఇ మెయిన్‌, నీట్‌ సహా వివిధ పోటీ పరీక్షలను నిర్వహిస్తున్న నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ఆరంభించిన యాప్‌ ‘నేషనల్‌ టెస్ట్‌ అభయా్‌స’లో 30 లక్షల మేరకు ఆన్‌లైన్‌ ప్రాక్టీస్‌ సెషన్స్‌/ మాక్‌ టెస్టులు ఉన్నాయి. ఈ యాప్‌ను మే 20న ఆరంభించిన విషయం తెలిసిందే. కొవిడ్‌ కారణంగా కోచింగ్‌కు వెళ్ళలేని పరిస్థితుల్లో, పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్న విద్యార్థులకు ఈ యాప్‌ ఉపయోగపడుతోంది. అచ్చంగా పరీక్ష మాదిరిగానే ప్రశ్నల సంఖ్య, గడవు నిర్దేశించారు. రోజులో తనకు వీలున్న సమయంలో ఈ మాక్‌ టెస్టులకు విద్యార్థి హాజరుకావచ్చు. ఒక్క ఇంగ్లీష్‌ మాధ్యమంలోనే వివిధ టెస్టులు ఈ యాప్‌లో అందుబాటులో ఉన్నాయి. జెఇఇ మెయిన్‌ సెప్టెంబరు 1 నుంచి 6 వరకు, నీట్‌ 13న జరుగనున్నాయి. పరీక్షలోని ఏ టాపిక్‌ కోసం విద్యార్థి ఎంత సమయం తీసుకున్నారో కూడా తెలుస్తుంది. టాపిక్‌వారీగా, మొత్తంగా స్కోర్‌ కూడా తెలియజేస్తుంది. దీంతో అభ్యర్థి తను ఎక్కడ బలంగా, మరెక్కడ వీక్‌గా ఉన్నారో తెలుసుకోవచ్చు. ఆండ్రాయిడ్‌ స్మార్మ్‌ ఫోన్‌ ఉంటే గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి ఈ యాప్‌ను 

డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.


Updated Date - 2020-07-22T20:16:52+05:30 IST