నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్‌లో ఎమ్మెస్సీ అప్లయిడ్‌ న్యూట్రిషన్‌

ABN , First Publish Date - 2020-05-30T18:08:22+05:30 IST

హైదరాబాద్‌లోని ఐసిఎంఆర్‌ - నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌(ఎన్‌ఐఎన్‌) ఎమ్మెస్సీ అప్లయిడ్‌ న్యూట్రిషన్‌ కోర్సుకు నోటిఫికేషన్‌

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్‌లో ఎమ్మెస్సీ అప్లయిడ్‌ న్యూట్రిషన్‌

హైదరాబాద్‌లోని ఐసిఎంఆర్‌ - నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌(ఎన్‌ఐఎన్‌) ఎమ్మెస్సీ అప్లయిడ్‌ న్యూట్రిషన్‌ కోర్సుకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఎన్‌ఐఎన్‌ నిర్వహిస్తున్న రెండేళ్ళ కాలవ్యవధి కలిగిన ఈ కోర్సులో 20 సీట్లు ఉన్నాయి. 

ఎంబిబిఎస్‌/ నర్సింగ్‌/ బీఎస్సీ హోమ్‌సైన్స్‌(ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌ స్పెషలైజేషన్‌తో)/ బీఎస్సీ(న్యూట్రిషన్‌/ ఫుడ్స్‌ అండ్‌ న్యూట్రిషన్‌/ అప్లయిడ్‌ న్యూట్రిషన్‌/ జువాలజీ/ బయోకెమిస్ట్రీ/ పబ్లిక్‌ హెల్త్‌/ క్లినికల్‌ న్యూట్రిషన్‌ అండ్‌ డైటెటిక్స్‌/ ఫుడ్‌ సైన్స్‌/ న్యూట్రిషన్‌ అండ్‌ డైటెటిక్స్‌ ఒక సబ్జెక్టుగా) ఉత్తీర్ణులు ఈ కోర్సు చేసేందుకు అర్హులు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్‌ చేసుకుని, నింపుకోవాలి. ఆ దరఖాస్తుకు రూ.3000(ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే రూ.2700)కి తీసుకున్న డిడి జత చేసి జూన్‌ 25లోగా పంపుకోవాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు పంపుకొనే సౌలభ్యం కూడా ఉంది. అర్హులైన అభ్యర్థుల జాబితా, హల్‌ టికెట్లను జూన్‌29న వెబ్‌సైట్‌లో పెడతారు. వారికి జూలై 12న ప్రవేశ పరీక్ష ఉంటుంది. కొవిడ్‌ పరిస్థితుల దృష్ట్యా నిర్దేశిత తేదీల్లో మార్పులు ఉండవచ్చు. యూజీసీ మార్గదర్శకాలమేరకు సెప్టెంబర్‌ 1 నుంచి తరగతులను ప్రారంభించనున్నారు.


సమాచారం

దరఖాస్తుకు చివరి తేదీ: జూన్‌ 25

ప్రవేశ పరీక్ష: 

జూలై 12

వెబ్‌సైట్‌: www.nin.res.in 

Updated Date - 2020-05-30T18:08:22+05:30 IST