ఆదికవి నన్నయ యూనివర్సిటీ పీజీసెట్ 2020
ABN , First Publish Date - 2020-06-18T18:31:43+05:30 IST
రాజమహేంద్రవరంలోని ఆదికవి నన్నయ యూనివర్సిటీ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ‘నన్నయ సెట్ - 2020’ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాజమహేంద్రవరంతోపాటు, కాకినాడ,

రాజమహేంద్రవరంలోని ఆదికవి నన్నయ యూనివర్సిటీ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ‘నన్నయ సెట్ - 2020’ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాజమహేంద్రవరంతోపాటు, కాకినాడ, తాడేపల్లిగూడెంక్యాంపస్‌లలో అందిస్తోన్న పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల సీట్లను కూడా ఈ పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు. సంబంధిత వివరాలు తెలుసుకుందాం..
పరీక్ష విధానం
పరీక్ష డిగ్రీ స్థాయిలో ఉంటుంది. సంబంధిత విభాగాల నుంచి 100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం మార్కులు 100. సమాధానాలను బ్లూ / బ్లాక్ బాల్‌పాయింట్ పెన్‌తో ఓఎంఆర్ పత్రం మీద గుర్తించాలి. పరీక్ష సమయం 90 నిముషాలు. భాషా సంబంధిత పరీక్షలు మినహా అన్ని ప్రశ్నపత్రాలను ఆంగ్ల మాధ్యమంలో ఇస్తారు. తెలుగు, హిందీ భాషా పరీక్షలు ఆయా భాషల్లోనే ఉంటాయి. పరీక్షలో ర్యాంక్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
అర్హతలు, స్పెషలైజేషన్లు
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగాల్లో డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. సైన్స్, ఇంజనీరింగ్ విభాగాలకు గ్రూప్ సబ్జెక్టుల్లో 50 శాతం మార్కులు రావాలి. ఆర్ట్స్, కామర్స్ విభాగాలకు డిగ్రీ పాసైతే చాలు. ఎంఎడ్ కోర్సుకు ద్వితీయ శ్రేణి మార్కులతో బీఎడ్ పూర్తిచేసి ఉండాలి. ఎస్సీ / ఎస్టీ వర్గాలకు 45 శాతం మార్కులు వస్తే చాలు.
ఎంఎస్సీ స్పెషలైజేషన్లు: బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, బోటనీ, ఆక్వా కల్చర్, జువాలజీ, మైక్రోబయాలజీ, క్లినికల్ న్యూట్రిషన్, ఫిజిక్స్, జియో ఫిజిక్స్, ఎలకా్ట్రనిక్స్, అప్లయిడ్ మేథమెటిక్స్, మేథమెటిక్స్, అనలిటికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ, జియాలజీ, కంప్యూటర్ సైన్స్.
ఎంఏ స్పెషలైజేషన్లు: ఎకనామిక్స్, ఎకనోమెట్రిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సైకాలజీ, సోషల్ వర్క్, ఇంగ్లీష్, తెలుగు, హిందీ ఇతర స్పెషలైజేషన్లు: ఎంకాం, ఎంపీఎడ్, ఎంహెచ్‌ఆర్‌ఎం, ఎంఎడ్
సీట్ల వివరాలు
రాజమహేంద్రవరం సైన్స్ క్యాంపస్: మొత్తం 307 సీట్లు ఉన్నాయి. ఎంఎస్సీ కోర్సులో బయోకెమిస్ట్రీ 15, బయోటెక్నాలజీ 15, బోటనీ 30, అక్వాకల్చర్ 16, జువాలజీ 16, ఫిజిక్స్ 30, జియోఫిజిక్స్ 30, అప్లయిడ్ మేథమెటిక్స్ 45, మేథమెటిక్స్ 45, అనలిటికల్ కెమిస్ట్రీ 15, ఆర్గానిక్ కెమిస్ట్రీ 30, జియాలజీ 20 సీట్లు ఉన్నాయి.
రాజమహేంద్రవరం ఆర్ట్స్ క్యాంపస్: ఈ క్యాంపస్‌లో మొత్తం 280 సీట్లు ఉన్నాయి. ఎంకాం, ఎంఏ - ఎకనామిక్స్/ పొలిటికల్ సైన్స్ / సైకాలజీ / సోషల్ వర్క్ / ఎకనోమెట్రిక్స్ / ఇంగ్లీష్ / తెలుగు కోర్సులకు ఒక్కోదానిలో 30 సీట్లు, ఎంపీఎడ్ కోర్సుకు 40 సీట్లు ఉన్నాయి.
కాకినాడ క్యాంపస్: ఇక్కడ మొత్తం 210 సీట్లు ఉన్నాయి. ఎంఎస్సీ - మేథమెటిక్స్, ఎంకాం, ఎంహెచ్‌ఆర్‌ఎం, ఎంఏ - ఎకనామిక్స్ / పొలిటికల్ సైన్స్ / పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ / ఇంగ్లీష్ కోర్సులకు ఒక్కోదానిలో 30 రెగ్యులర్ సీట్లు ఉన్నాయి.
తాడేపల్లిగూడెం క్యాంపస్: ఈ క్యాంప్‌సలో 75 సీట్లు ఉన్నాయి. ఎమ్మెస్సీ కోర్సుకు సంబంధించి ఫిజిక్స్‌లో 30, అనలిటికల్ కెమిస్ట్రీలో 15, ఆర్గానిక్ కెమిస్ట్రీలో 30 రెగ్యులర్ సీట్లు ఉన్నాయి.
ముఖ్య సమాచారం
దరఖాస్తు ఫీజు: రూ.500 (ఎస్సీ / ఎస్టీ / దివ్యాంగులకు రూ.300)
ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: జూన్ 30
హాల్‌టికెట్ డౌన్‌లోడ్: జూలై చివరి వారం
ప్రవేశ పరీక్ష తేదీ: ఆగస్టు మొదటి వారం
పరీక్ష కేంద్రాలు: విజయవాడ, విశాఖపట్నం, అమలాపురం, కాకినాడ, రాజమండ్రి, రంపచోడవరం, ఏలూరు, భీమవరం, జంగారెడ్డి గూడెం, తాడేపల్లిగూడెం
వెబ్‌సైట్: www.aknudoa.in