600 ఐఒసిఎల్‌లో అప్రెసంటిస్ ఉద్యోగాలు
ABN , First Publish Date - 2020-05-29T17:04:43+05:30 IST
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఒసిఎల్) వివిధ విభాగాల్లో 600 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ రిక్రూట్‌మెంట్‌కు

జూన్ 21 వరకు గడువు పెంపు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఒసిఎల్) వివిధ విభాగాల్లో 600 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన ప్రకటన గతంలోనే వెలువడింది. దరఖాస్తు గడువు కూడా మే 25తో ముగిసింది. లాక్‌డౌన్ కారణంగా సంస్థ దరఖాస్తు గడువును జూన్ 21 వరకు పొడిగించింది. అంతేకాకుండా ఖాళీల సంఖ్యను 500 నుంచి 600 పెంచింది. ఇప్పటికే అప్లయ్ చేసుకున్నవారు మళ్లీ దరఖాస్తు చేసుకోనవసరం లేదు. డేటా ఎంట్రీ ఆపరేటర్(ఫ్రెష్ అప్రెంటిస్‌లు/స్కిల్డ్ సర్టిఫికెట్ కలిగినవారు)కు 15 నెలల శిక్షణ ఇస్తారు. మిగతా విభాగాల వారికి 12 నెలల అప్రెంటిస్‌షిప్ ఉంటుంది.
విభాగాలు
మెకానికల్, ఎలక్ర్టికల్, ఇన్‌స్ర్టుమెంటేషన్, సివిల్, ఎలక్ర్టికల్ అండ్ ఎలక్ర్టానిక్స్, ఎలక్ర్టానిక్స్
అర్హత: అభ్యర్థులు సంబంధిత విభాగంలో మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. జనరల్/ఓబీసీ అభ్యర్థులు 50 శాతం, ఎస్సీ, ఎస్టీలు 45 శాతం మార్కులు సాధించాలి.
ఫిట్టర్, ఎలక్ర్టీషియన్, ఎలక్ర్టానిక్స్ మెకానిక్, ఇన్‌స్ర్ట్టుమెంట్ మెకానిక్, మెషినిస్ట్
అర్హత: అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో ఐటిఐ పూర్తి చేసి ఉండాలి.
అకౌంటెంట్
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. జనరల్/ఓబీసీ అభ్యర్థులు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యూబిడి అభ్యర్థులయితే 45 శాతం సాధించాలి.
డేటా ఎంట్రీ ఆపరేటర్(ఫ్రెష్ అప్రెంటిస్ / స్కిల్డ్ సర్టిఫికెట్ కలిగినవారు):
అర్హత: 12వ తరగతి ఉత్తీర్ణత లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. జనరల్/ఓబీసీ అభ్యర్థులు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యూబిడి అభ్యర్థులయితే 45 శాతం సాధించాలి.
వయస్సు: అభ్యర్థుల వయసు 2020 ఫిబ్రవరి 29 నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ(నాన్ క్రిమిలేయర్), పిడబ్ల్యూబిడి అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. పదో తరగతి మార్కుల జాబితాలో ఉన్న పుట్టిన తేదీనే పరిగణనలోని తీసుకుంటారు.
ఎంపిక విధానం
రాత పరీక్ష, మెడికల్ ఫిట్‌నెస్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఈ పరీక్షను మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. ప్రశ్నపత్రంలో 100 ప్రశ్నలుంటాయి. ప్రశ్నలన్నీ మల్టిపుల్ చాయిస్ విధానంలోనే ఉంటాయి. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు.
ప్రశ్నపత్రం స్వరూపం
ట్రేడ్ అప్రెంటిస్ అకౌంటెంట్
జనరిక్ ఆప్టిట్యూడ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ - 30 మార్కులు
రీజనింగ్ ఎబిలిటిస్ - 30 మార్కులు
బేసిక్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ స్కిల్స్ - 40 మార్కులు
ట్రేడ్ అప్రెంటిస్
(డేటా ఎంటీ ఆపరేటర్/ రిటైల్ సేల్స్ అసోసియేట్)
జనరిక్ ఆప్టిట్యూడ్ - 30 మార్కులు
రీజనింగ్ ఎబిలిటిస్- 30 మార్కులు
బేసిక్ ఇంగ్లిష్ - 40 మార్కులు
మిగతా అన్నీ ట్రేడ్‌లకు
సంబంధిత విభాగాలకు సంబంధించి - 40 మార్కులు
జనరిక్ ఆప్టిట్యూడ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ - 20 మార్కులు
రీజనింగ్ ఎబిలిటిస్ - 20 మార్కులు
బేసిక్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ స్కిల్స్ - 20 మార్కులు
ముఖ్య సమాచారం
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
చివరి తేదీ: జూన్ 21
వెబ్‌సైట్: www.iocl.com, https://rectt.in