ఇగ్నో ఆన్‌లైన్‌ ప్రోగ్రామ్స్‌

ABN , First Publish Date - 2020-06-04T20:10:58+05:30 IST

ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ(ఇగ్నో) కొత్తగా పది ఆన్‌లైన్‌ ప్రోగ్రామ్‌లను ప్రకటించి వీటి సంఖ్యను 13కి పెంచింది. ‘స్వయం’పోర్టల్‌ ద్వారా మరో 24 కోర్సులను అందిస్తోంది. అగ్రికల్చరల్‌, సస్టయినబిలిటీ సైన్సెస్‌, లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌, సోషియాలజీ,

ఇగ్నో ఆన్‌లైన్‌ ప్రోగ్రామ్స్‌

ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ(ఇగ్నో) కొత్తగా పది ఆన్‌లైన్‌ ప్రోగ్రామ్‌లను ప్రకటించి వీటి సంఖ్యను 13కి పెంచింది. ‘స్వయం’పోర్టల్‌ ద్వారా మరో 24 కోర్సులను అందిస్తోంది.  అగ్రికల్చరల్‌, సస్టయినబిలిటీ సైన్సెస్‌, లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌, సోషియాలజీ, లా, టూరిజం, లాంగ్వేజెస్‌, ఐటి, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌, విజువల్‌ ఆర్ట్‌ ఇప్పుడు ఆఫర్‌ చేసిన కోర్సుల్లో ఉన్నాయి. ఈ-విద్యాభారతి(టెలి ఎడ్యుకేషన్‌)లో ఈ ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉంటాయి. తద్వారా అంతర్జాతీయ స్థాయికి చేరుకుంటున్నాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇగ్నో ఆన్‌లైన్‌ పోర్టల్‌iop.ignouonline.ac.in లేదా సమర్థ్‌ పోర్టల్‌ https://ignouiop.samarth.edu.in/index.php/registration/user/register లో రిజిస్టర్‌ చేసుకోవచ్చు. స్వయం కోర్సులకు దాని పోర్టల్‌ swayam.gov.in/ignou లో రిజిస్టర్‌ చేసుకోవచ్చు. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ చేపట్టిన ‘భారత పథే ఆన్‌లైన్‌’కు ఇది కొనసాగింపు అని ఇగ్నో వీసీ ప్రొఫెసర్‌ నాగేశ్వరరావు తెలిపారు.

Updated Date - 2020-06-04T20:10:58+05:30 IST