ఎంట్రెన్స్ టెస్టులకు.. గెట్ రెడీ

ABN , First Publish Date - 2020-05-13T18:01:41+05:30 IST

కొవిడ్‌-19 కారణంగా తలెత్తిన ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా తెలంగాణ రాష్ట్రంలోని వివిధ సెట్‌లకు దరఖాస్తు గడువు పెంచారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నిర్వహించే అన్ని టెస్టులకు మే 15 ఆఖరు

ఎంట్రెన్స్ టెస్టులకు.. గెట్ రెడీ

ఆంధ్రజ్యోతి(13-05-2020):

కొవిడ్‌-19 కారణంగా తలెత్తిన ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా తెలంగాణ రాష్ట్రంలోని వివిధ సెట్‌లకు దరఖాస్తు గడువు పెంచారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నిర్వహించే అన్ని టెస్టులకు మే 15 ఆఖరు తేదీగా ఖరారు చేశారు. వీటితో పాటు పాలిసెట్‌కు మే 31, టిఎస్‌ఆర్‌జెసిసెట్‌కు జూన్‌ 1 వరకు పొడిగించారు. పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పరీక్షల తేదీలను కూడా త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఆలస్యం, పోటీ అందరికీ సమానం అయినందున, అన్నింటినీ పక్కనపెట్టి, పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ కావడం ఒక్కటే ఇప్పటికి శరణ్యం.


టిఎస్ ఎంసెట్

ఈ పరీక్షను జెఎన్‌టియు హైదరాబాద్‌ నిర్వహిస్తోంది.

కోర్సులు: ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌(ఎంబిబిఎస్‌, బిడిఎస్‌, ఆయుష్‌ మినహా)

అర్హత: ఇంజనీరింగ్‌ కోర్సులకు ఇంటర్‌ ఎంపిసి, అగ్రికల్చర్‌ కోర్సులకు ఇంటర్‌ బైపిసి ఉత్తీర్ణులై ఉండాలి. 

వెబ్‌సైట్‌: https://eamcet.tsche.ac.in/


టిఎస్‌ ఐసెట్‌

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే టెస్ట్‌ ఐసెట్‌. దీన్ని ఈ ఏడాది వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయం నిర్వహిస్తోంది.

కోర్సులు: మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ర్టేషన్‌   (ఎంబీఏ), మాస్టర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్‌  (ఎంసీఏ)

అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత

వెబ్‌సైట్‌: https://icet.tsche.ac.in/


టిఎస్‌ ఎడ్‌సెట్‌

హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలంగాణ స్టేట్‌ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (టిఎస్‌ ఎడ్‌సెట్‌)ను నిర్వహిస్తోంది. 

కోర్సు: బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌(బీఈడీ)

కాల వ్యవధి: రెండేళ్లు

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ ఉత్తీర్ణత.

వెబ్‌సైట్‌: https://www.tsche.ac.in/


టిఎస్‌ ఈసెట్‌

తెలంగాణ రాష్ట్రంలోని వివిధ వృత్తి విద్యా కళాశాలలో బీఈ/బీటెక్‌/బీఫార్మసీ కోర్సులో లేటరల్‌ ఎంట్రీ ప్రవేశానికి ఈసెట్‌ని నిర్వహిస్తున్నారు. 

అర్హత: డిప్లొమా ఉత్తీర్ణత.

వెబ్‌సైట్‌: https://ecet.tsche.ac.in/


టిఎస్‌ పీజీఈసెట్

తెలంగాణ రాష్ట్రంలోని వివిధ వృత్తి విద్యా కళాశాలల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి  ఉద్దేశించిన  పీజీఈసెట్‌ని హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తోంది.

కోర్సులు: ఎంఈ, ఎంటెక్‌, ఎంఫార్మసీ, ఎంఆర్క్‌, గ్రాడ్యుయేట్‌ లెవల్‌ ఫార్మడి

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ, బీటెక్‌, బీఫార్మసీ, బీఆర్క్‌ ఉత్తీర్ణత.

వెబ్‌సైట్‌: https://pgecet.tsche.ac.in/


టిఎస్‌ లాసెట్

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన కళాశాలల్లో మూడేళ్ల, ఐదేళ్ల లా కోర్సులు/లాలో మాస్టర్స్‌ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష టిఎస్‌ లాసెట్‌/పీజీ లాసెట్‌. ఈ పరీక్షను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తోంది.

వెబ్‌సైట్స్‌: https://lawcet.tsche.ac.in/, https://pglcet.tsche.ac.in/


టిఎస్‌ పిఇసెట్‌

వివిధ వ్యాయామ విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష తెలంగాణ స్టేట్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(టిఎస్‌ పిఇసెట్‌). ఈ పరీక్షను మహాత్మాగాంధీ యూనివర్సిటీ నిర్వహిస్తోంది.

కోర్సులు: బిపిఇడి(రెండేళ్లు), డిపిఇడి(రెండేళ్లు)

అర్హతలు: బిపిడికి మూడేళ్ల బ్యాచిలర్స్‌ డిగ్రీ, డిపిఇడికి ఇంటర్‌ ఉత్తీర్ణులై ఉండాలి.

వెబ్‌సైట్‌: https://pecet.tsche. ac.in /PECET /PECET-_-HomePage.a-spx 

Updated Date - 2020-05-13T18:01:41+05:30 IST