ఐఐఎఫ్‌పీటీ ఇంజనీరింగ్‌ కోర్సులు

ABN , First Publish Date - 2020-08-20T19:52:02+05:30 IST

తమిళనాడులోని తంజావూర్‌లో ఉన్న ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ టెక్నాలజీ(ఐఐఎఫ్‌పీటీ) ‘ఆహార కోర్సు’ల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఫుడ్‌ టెక్నాలజీ విభాగంలో బ్యాచిలర్‌ ఆఫ్‌

ఐఐఎఫ్‌పీటీ ఇంజనీరింగ్‌ కోర్సులు

తమిళనాడులోని తంజావూర్‌లో ఉన్న ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ టెక్నాలజీ(ఐఐఎఫ్‌పీటీ) ‘ఆహార కోర్సు’ల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఫుడ్‌ టెక్నాలజీ విభాగంలో బ్యాచిలర్‌ ఆఫ్‌ టెక్నాలజీ(బీటెక్‌), మాస్టర్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎంటెక్‌), పీహెచ్‌డీ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆహార రంగంలో సైంటిస్టులుగా, ప్రాసెస్‌ ఇంజనీర్లుగా రాణించాలనుకొనేవారికి ఇది చక్కని అవకాశం. 


బీటెక్‌ ప్రోగ్రామ్‌

ఇది నాలుగేళ్ల కోర్సు. ఎనిమిది సెమిస్టర్లు ఉంటాయి. మొత్తం 75 సీట్లు ఉన్నాయి. ఇందులో ఓపెన్‌ కేటగిరీకి 29, ఓపెన్‌ ఈడబ్ల్యుఎ్‌సకు 8, ఓపెన్‌ దివ్యాంగులకు 1, ఓబీసీలకు 19, ఓబీసీ దివ్యాంగులకు 1, ఎస్సీలకు 10, ఎస్సీ దివ్యాంగులకు 1, ఎస్టీలకు 6 సీట్లు కేటాయించారు.


అర్హత: జేఈఈ మెయిన్‌ 2020లో పేపర్‌ - 1 రాసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ స్కోరు ఆధారంగా జాయింట్‌ సీట్‌ అలొకేషన్‌ అథారిటీ ప్రవేశం కల్పిస్తుంది. 


ఎంటెక్‌ ప్రోగ్రామ్‌

కోర్సు కాలవ్యవధి రెండేళ్లు. నాలుగు సెమిస్టర్లు ఉంటాయి. ఇందులో ఫుడ్‌ ప్రాసెస్‌ ఇంజనీరింగ్‌, ఫుడ్‌ ప్రాసెస్‌ టెక్నాలజీ, ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ క్వాలిటీ అస్యూరెన్స్‌ స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో స్పెషలైజేషన్‌లో 12 సీట్లు ఉన్నాయి. సంస్థ నిర్వహించే ఆన్‌లైన్‌ ఎగ్జామ్‌ ద్వారా ప్రవేశం కల్పిస్తారు. అకడమిక్‌ మార్కులకు 30 శాతం, ఆన్‌లైన్‌ ఎగ్జామ్‌కు 70 శాతం వెయిటేజీ ఇస్తారు. 


అర్హత: మొదటి స్పెషలైజేషన్‌కు ఫుడ్‌ టెక్నాలజీ, ఫుడ్‌ ప్రాసెస్‌ ఇంజనీరింగ్‌, అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌, అగ్రికల్చరల్‌ అండ్‌ ఫుడ్‌ ఇంజనీరింగ్‌, ఫుడ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ అండ్‌ ప్రివెన్షన్‌ టెక్నాలజీ, డెయిరీ టెక్నాలజీ, ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ టెక్నాలజీ, పోస్ట్‌ హార్వెస్ట్‌ టెక్నాలజీ, ఫిషరీస్‌ ఇంజనీరింగ్‌ విభాగాల్లో ఏదైనా ఒకదానిలో బీఈ/ బీటెక్‌ పూర్తిచేసి ఉండాలి. రెండోదానికి పై వాటితోపాటు హోం సైన్స్‌, ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ న్యూట్రిషన్‌, ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ క్వాలిటీ కంట్రోల్‌ విభాగాల్లో ఇంజనీరింగ్‌ డిగ్రీ చేసినవారు అర్హులు. మూడోదానికి పై వాటితోపాటు ఇండస్ట్రియల్‌ ్క్ష అప్లయిడ్‌ మైక్రో బయాలజీ, కెమిస్ట్రీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 70 శాతం మార్కులు తప్పనిసరి. క్రెడిట్‌ పద్ధతయితే 4కి 3 లేదా 10కి 7 చొప్పున ఓజీపీఏ ఉండాలి.


పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌

కోర్సు కాల వ్యవధి మూడేళ్లు. ఆరు సెమిస్లర్లు ఉంటాయి. ఇందులో ఫుడ్‌ ప్రాసెస్‌ ఇంజనీరింగ్‌, ఫుడ్‌ ప్రాసెస్‌ టెక్నాలజీ స్పెషలైజేషన్లు ఎంచుకోవచ్చు. ఒక్కో స్పెషలైజేషన్‌కు 8 సీట్లు ఉన్నాయి. 


అర్హత: పైన తెలిపిన విభాగాల్లో 70 శాతం మార్కులతో ఎంఈ/ ఎంటెక్‌ పూర్తిచేసి ఉండాలి. అకడమిక్‌ మార్కులు, రాత పరీక్ష స్కోరు, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశం లభిస్తుంది. 


సమాచారం

బీటెక్‌ ప్రోగ్రామ్‌ దరఖాస్తు ఆఖరు తేదీని త్వరలో ప్రకటిస్తారు. 

ఎంటెక్‌, పీహెచ్‌డీ ప్రోగ్రాములకు చివరితేదీ సెప్టెంబరు 30

వెబ్‌సైట్‌:www.iifpt.edu.in

Updated Date - 2020-08-20T19:52:02+05:30 IST