డ్రమటిక్‌ ఆర్ట్స్‌లో డిప్లొమా

ABN , First Publish Date - 2020-06-04T20:08:55+05:30 IST

లక్నోలోని భారతేందు అకాడమీ ఆఫ్‌ డ్రమటిక్‌ ఆర్ట్స్‌ - యూపీ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ పరిధిలో పనిచేస్తున్న స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థ. డ్రమటిక్‌ ఆర్ట్స్‌లో రెండేళ్ళ డిప్లొమా కోర్సుకు దరఖాస్తులు కోరుతోంది.

డ్రమటిక్‌ ఆర్ట్స్‌లో డిప్లొమా

లక్నోలోని భారతేందు అకాడమీ ఆఫ్‌ డ్రమటిక్‌ ఆర్ట్స్‌  - యూపీ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ పరిధిలో పనిచేస్తున్న స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థ. డ్రమటిక్‌ ఆర్ట్స్‌లో రెండేళ్ళ డిప్లొమా కోర్సుకు దరఖాస్తులు కోరుతోంది.  హిందీ, ఇంగ్లీష్‌ మాధ్యమాల్లో ఈ కోర్సును నిర్వహిస్తున్నారు. యాక్టింగ్‌, డిజైనింగ్‌, థియేటర్‌ టెక్నిక్స్‌ కలగలిసిన పూర్తి స్థాయి రెసిడెన్షియల్‌ కోర్సు ఇది. డిగ్రీ ఉత్తీర్ణతకు తోడు డ్రమటిక్‌ రంగంపై నిర్దేశించిన విధంగా అనుభవం, అవగాహన కలిగి ఉండాలి. ఆగస్టు 1 నాటికి అభ్యర్థి వయస్సు 20-30 సంవత్సరాల మధ్య ఉండాలి. సీట్లు 20. ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల రూ.3000 స్కాలర్‌షిప్‌ ఇస్తారు. ఫీజులు, హాస్టల్‌ ఖర్చులకు ఆ మొత్తం సరిపోతుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ, ఆడిషన్‌ ఆధారంగా ఎంపిక ఉంటుంది. రాత పరీక్ష ఆగస్టు 5న, ఇంటర్వ్యూ 5, 6 తేదీల్లో, తుది ఎంపిక కోసం క్యాంపస్‌లో వర్క్‌షాప్‌ 7, 8 తేదీల్లోనూ జరుగుతాయి. ఆగస్టు 17 నుంచి కోర్సు ఆరంభమవుతుంది. దరఖాస్తు ఫీజు రూ.500 కాగా పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 25లోగా పంపుకోవాలి.

వెబ్‌సైట్‌: www.upgov.nic.in, http://www.bnalko.in/StaticPages/admission_procedure.aspx

Updated Date - 2020-06-04T20:08:55+05:30 IST