డిగ్రీ ప్రవేశాలకు దోస్త్ షురూ

ABN , First Publish Date - 2020-06-23T19:55:24+05:30 IST

తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన దోస్త్‌(డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీస్‌, తెలంగాణ) విడుదలైంది. బిఎ, బికామ్‌, బీఎస్సీ, బిబిఎ, బిబిఎం, బిసిఎ వంటి అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో

డిగ్రీ ప్రవేశాలకు దోస్త్ షురూ

జూలై 1 నుంచి రిజిస్ట్రేషన్ ఆరంభం

తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన దోస్త్‌(డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీస్‌, తెలంగాణ) విడుదలైంది. బిఎ, బికామ్‌, బీఎస్సీ, బిబిఎ, బిబిఎం, బిసిఎ వంటి అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో చేరేందుకు తెలంగాణలో ఏకైక మార్గం దోస్త్‌. అడ్మిషన్‌ ప్రక్రియలో విద్యార్థులకు సౌకర్యంగా ఉండేందుకు పలు చర్యలు తీసుకున్నారు. వాటన్నింటినీ ఆసాంతం తెలుసుకుంటే రిజిస్ట్రేషన్‌ నుంచి అడ్మిషన్‌ వరకు ప్రతి దశ సులువుగానే ఉంటుంది. 


ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన యూనివర్సిటీలకు అనుబంధంగా కోర్సులను అందిస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో చేరేందుకు దోస్త్‌ ఏకైక ఛానల్‌. ఈ పోర్టల్‌ను పూర్తిగా స్టూడెంట్‌ ఫ్రెండ్లీగా మలచినట్టు నోటిఫికేషన్‌లో తెలిపారు. ఇంటర్మీడియెట్‌ హాల్‌ టికెట్‌ నంబర్‌తో పోర్టల్‌లోకి లాగిన్‌ కావచ్చు.

విద్యార్థి తన ఆధార్‌ నంబర్‌తో మొబైల్‌ నంబర్‌ను లింక్‌ చేసుకుని ఉంటే ఒటిపి అథెంటికేషన్‌తో దోస్త్‌లో నేరుగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. 

ఒక వేళ అలా లింక్‌ చేసుకోని పక్షంలో

తల్లిదండ్రుల నంబర్‌తో ఆధార్‌ నంబర్‌ను లింక్‌ చేసుకోవచ్చు.

ఫొటో అథెంటికేషన్‌తో టి యాప్‌ పోలియో మొబైల్‌ యాప్‌తో దోస్త్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు.

దోస్త్‌ హెల్ప్‌లైన్‌ సెంటర్‌ లేదంటే మీ సేవ సెంటర్‌లోనూ రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు.

మొదట రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద రూ.200 చెల్లించాలి.

రిజిస్ట్రేషన్‌ తరవాత ఐడి, పిన్‌ నంబర్‌ వస్తాయి. ఈ రెంటినీ అడ్మిషన్‌ ప్రక్రియ పూర్తయ్యే వరకు విద్యార్థులు జాగ్రత్తగా ఉంచుకోవాలి. 

దోస్త్‌ ఐడి, పాస్‌వర్డ్‌/ పిన్‌ సహాయంతో విద్యార్థులు దరఖాస్తు ఫారమ్‌ను ఓపెన్‌ చేసుకోవచ్చు. 

అడిగిన వివరాలను జాగ్రత్తగా నింపాలి. కరెక్షన్‌ చేసుకునేందుకు ఎడిట్‌ ఆప్షన్‌ లేదని గుర్తుపెట్టుకోవాలి. 

కాలేజీ, కోరుకున్న కోర్సు, గ్రూప్‌ ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ర్యాంకుతో సంబంధం లేకుండా ఏ కాలేజీకైనా ఆప్షన్‌ ఇచ్చుకునే సౌలభ్యం విద్యార్థికి ఉంది. అలాగే గత ఏడాది కౌన్సెలింగ్‌ ప్రక్రియ వివరాలు దోస్త్‌ వెబ్‌సైట్‌లో లభ్యమవుతున్నాయి. ఆ వివరాలు అడ్మిషన్లపై అవగాహనకు ఒక ప్రాతిపదిక మాత్రమే. ఈ ఏడాది కూడా అదేవిధంగా ఎంపిక ప్రక్రియ ఉంటుందని చెప్పలేం. 

విద్యార్థి సాధించిన మెరిట్‌, రిజర్వేషన్ల సహా అన్నింటినీ దృష్టిలో ఉంచుకుని సీట్ల కేటాయింపు జరుగుతుంది. 

ఏ దశలో అయినా ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలి. ఆగస్టు 20 - 24 మధ్య ఎంపికైన కాలేజీకి వెళ్ళి ఫీజు కట్టి, సర్టిఫికెట్లను సమర్పించుకోవాలి. అప్పుడు మాత్రమే మీ సీటు కన్‌ఫర్మ్‌ అవుతుంది. 

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 60 హెల్ప్‌ లైన్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు. 


కొత్త ఫీచర్లు

ఎవరైనా వ్యక్తులు తాకేందుకు వీలులేని విధంగా రియల్‌టైమ్‌ డిజిటల్‌ ఫేస్‌ రికగ్నిషన్‌ కోసం టి యాప్‌ ఫోలియోను ప్రవేశపెట్టారు. విద్యార్థులు తమ మొబైల్‌లో దీన్ని ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. 

లైవ్‌ ఫొటోగ్రా్‌ఫ(సెల్ఫీ ఫొటో) అథెంటికేషన్‌ విజయవంతమైన తరవాత ఇంటర్‌ బోర్డు వద్ద ఉన్న విద్యార్థి ఫొటోగ్రా్‌ఫతో కలిపి ఐడి నంబర్‌ జనరేట్‌ అవుతుంది. యూట్యూబ్‌ ఛానల్‌లో దోస్త్‌ వీడియోలు ఉన్నాయి. తరచూ తలెత్తే ప్రశ్నలకు జవాబులు లభ్యమవుతాయి.  

7901002200  వాట్సప్‌ నంబర్‌తో కాంటాక్ట్‌ కావచ్చు.

ఫేస్‌బుక్‌ పేజ్‌: https://www.facebook.com/dost.telangana

ట్విట్టర్‌: https://twitter.com/dost_telangana



Updated Date - 2020-06-23T19:55:24+05:30 IST