బీబీఎ, ఎంబీఏ కోర్సులకు ఐఐటిటిఎం ఆహ్వానం

ABN , First Publish Date - 2020-05-24T19:47:15+05:30 IST

భారతదేశంలో పర్యాటక రంగం విస్తరిస్తోంది. అందుకు తగ్గట్టు అవసరమైన మానవ వనరులను తీర్చిదిద్దేందుకు కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ

బీబీఎ, ఎంబీఏ కోర్సులకు ఐఐటిటిఎం ఆహ్వానం

పర్యాటక ప్రపంచం పిలుస్తోంది

భారతదేశంలో పర్యాటక రంగం విస్తరిస్తోంది. అందుకు తగ్గట్టు అవసరమైన మానవ వనరులను తీర్చిదిద్దేందుకు కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ  నెల్లూరు, గోవా, గ్వాలియర్‌, భువనేశ్వర్‌, నోయిడాలో ఐఐటిటిఎం(ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌)లను  ఏర్పాటు చేసింది. వీటిని ఇందిరాగాంధీ జాతీయ గిరిజన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ సంస్థల్లో బీబీఏ, ఎంబీఏ కోర్సులు చేయాలనుకునేవారికి పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ రుణసదుపాయం కల్పిస్తోంది. అంతేకాకుండా వివిధ వర్గాలకు చెందిన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు లభిస్తున్నాయి. కోర్సులు పూర్తిచేసుకున్నవారు ప్రభుత్వ, ప్రైవేటు పర్యాటక సంస్థలు, రిసార్టులు, కేటరింగ్‌, విమానయాన సంస్థలు, హోటళ్లు ఆతిథ్యంతో ముడిపడే ఇతర సంస్థల్లో మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. క్యాంపస్‌ నియామకాల ద్వారా ప్రముఖ దేశీయ పర్యాటక సంస్థలు అభ్యర్థులను ఎంపిక చేసుకుంటున్నాయి. ప్రస్తుతం ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐటిటిఎం) బీబీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన వెలువడింది. దేశవ్యాప్తంగా ఉన్న పలు క్యాంప్‌సల్లో ఈ కోర్సులను అందిస్తున్నారు. ప్రవేశ పరీక్ష, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.


బీబీఏ, ఎంబీఏ రెండూ కోర్సులకూ ప్రవేశ పరీక్ష ఒకే విఽధంగా ఉంటుంది. ప్రశ్నలు అడిగే విధానంలోనే వ్యత్యాసం కనిపిస్తుంది. 100 మార్కులకు పరీక్షను నిర్వహిస్తారు. ప్రతి పశ్నకు ఒక మార్కు చొప్పున 100 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో జనరల్‌ అవేర్‌నెస్‌ 50, వెర్బల్‌ ఎబిలిటీ 25, క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ 25 ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్నలన్నీ అబ్జెక్టివ్‌ తరహాలోనే ఉంటాయి. పరీక్ష కాలవ్యవధి రెండు గంటలు. రుణాత్మక మార్కులు లేవు.


సమాచారం

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

దరఖాస్తుకు చివరి తేదీ: మే 29

పరీక్ష తేదీ: జూన్‌ 7

వెబ్‌సైట్‌:  www.iittm.ac.in

Updated Date - 2020-05-24T19:47:15+05:30 IST