ఏయూ సెట్ 2020
ABN , First Publish Date - 2020-06-06T20:48:32+05:30 IST
విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ సైన్స్, ఆర్ట్స్, కామర్స్, ఇతర విభాగాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు నిర్వహిస్తోంది. ఉమ్మడి ప్రవేశ
విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ సైన్స్, ఆర్ట్స్, కామర్స్, ఇతర విభాగాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు నిర్వహిస్తోంది. ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఏయూసెట్) ద్వారా ప్రవేశాలు కల్పిస్తుంది. ఇప్పటికే ప్రవేశ పరీక్ష పూర్తి కావాల్సి ఉంది. కొవిడ్-19 కారణంగా వాయిదాపడిన ఏయూసెట్‌కు ప్రకటన విడుదలైన నేపథ్యంలో సంబంధిత వివరాలు తెలుసుకుందాం.
కోర్సులు
ఎంఏ స్పెషలైజేషన్లు: ఇంగ్లీష్, హిందీ, సంస్కృతం, తెలుగు, అప్లయిడ్ ఎకనామిక్స్, ఎకనామిక్స్, క్వాంటిటేటివ్ ఎకనామిక్స్, అడల్ట్ అండ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్, ప్రాచీన చరిత్ర అండ్ ఆర్కియాలజీ, హిస్టరీ, పాలిటిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, సైకాలజీ, ఆంత్రపాలజీ, సోషల్ వర్క్, ఫిలాసఫీ, మ్యూజిక్, డ్యాన్స్, యోగా.
ఎంకాం, ఎంఎల్‌ఐఎస్సీ, ఎంజేఎంసీ, ఎంహెచ్‌ఆర్‌ఎం, ఎంఈడీ.
ఎంఎస్సీస్పెషలైజేషన్లు: లైఫ్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, మేథమెటికల్ సైన్సెస్, కెమికల్ సైన్సెస్, జియాలజీ.
అర్హతల వివరాలు
పీజీ కోర్సులో ఎంచుకొనే స్పెషలైజేషన్‌ను అనుసరించి సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ ఉండాలి. డిగ్రీ స్థాయిలో జనరల్ అభ్యర్థులకు 50శాతం మార్కులు, రిజర్వుడ్ కేటగిరీకి 45 శాతం మార్కులు అవసరం. చివరి సంవత్సర పరీక్షలు రాసే అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వయో పరిమితి నిబంధన లేదు కానీ ఫీజు రీఇంబర్స్‌మెంట్ కోసం ప్రయత్నించే రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితిని నిర్దేశించారు. ఎస్సీ, ఎస్టీలకు 34 ఏళ్లు, ఈబీసీ, మైనారిటీలు, దివ్యాంగులకు 30 ఏళ్లు మించకూడదు. రాత పరీక్షలో అర్హత సాధించాలంటే జనరల్ అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులు తెచ్చుకోవాలి. రిజర్వ్‌డ్ అభ్యర్థులకు 45 శాతం మార్కులు వస్తే చాలు. రాత పరీక్షలో సాధించిన ర్యాంక్ ఆధారంగా అభ్యర్థుల జాబితా తయారుచేసి కౌన్సిలింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు.
పరీక్ష విధానం
పరీక్ష సమయం 90 నిమిషాలు. మొత్తం 100 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు 1 మార్కు. అంటే మొత్తం మార్కులు 100. రుణాత్మక మార్కులు లేవు. లాంగ్వేజ్ సబ్జెక్టులు మినహా ప్రవేశ పరీక్ష ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది.
పరీక్ష కేంద్రాలు: విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు.
ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: జూలై 5
వెబ్‌సైట్: www.audoa.in