అరుదైన ఆర్ట్‌ కోర్సులు

ABN , First Publish Date - 2020-07-22T19:45:54+05:30 IST

న్యూఢిల్లీలోని నేషనల్‌ మ్యూజియం ఇన్‌స్టిట్యూట్‌(ఎన్‌ఎంఐ) భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు చెందిన ‘సాంస్కృతిక విశ్వవిద్యాలయం’. 1989లో ఈ సంస్థకు

అరుదైన ఆర్ట్‌ కోర్సులు

ఎన్‌ఎంఐ

న్యూఢిల్లీలోని నేషనల్‌ మ్యూజియం ఇన్‌స్టిట్యూట్‌(ఎన్‌ఎంఐ) భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు చెందిన ‘సాంస్కృతిక విశ్వవిద్యాలయం’. 1989లో ఈ సంస్థకు యూనివర్సిటీ హోదా లభించింది. నేషనల్‌ మ్యూజియం కాంప్లెక్స్‌లో ఉన్న ఈ సంస్థ అతి త్వరలోనే నోయిడ్‌లోని క్యాంపస్‌కు వెళ్ళనుంది. ఆరంభం నుంచి ఆర్ట్‌ అలాగే సాంస్కృతిక వారసత్వంలో శిక్షణ, పరిశోధనకు ప్రాధాన్యం ఇస్తోంది. రానున్న విద్యా సంవత్సరంలో వివిధ కోర్సుల్లో ప్రవేశానికి ప్రస్తుతం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. హిస్టరీ ఆఫ్‌ ఆర్ట్‌, కన్జర్వేషన్‌, మ్యూజియాలజీ పీజీ కోర్సులకు తోడు పిహెచ్‌డిలో ప్రవేశానికి ఈ సంస్థ దరఖాస్తులు కోరుతోంది.


కోర్సులు - అర్హతలు

హిస్టరీ ఆఫ్‌ ఆర్ట్‌: ఇందులో 25 సీట్లు ఉన్నాయి. 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.


కన్జర్వేషన్‌: ఈ కోర్సుకు 15 సీట్లు కేటాయించారు. ఫిజిక్స్‌, కెమిస్ర్టీ, జియాలజీ, బయాలజీ, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ లేదా విజివల్‌/ఫైన్‌ ఆర్ట్స్‌ లేదా ఆర్కిటెక్చర్‌, ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీలో 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌ లేదా హిస్టరీ, జాగ్రఫీ, ఆంత్రోపాలజీ, ఆర్కియాలజీ సంబంధిత డిసిప్లిన్‌లో 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌. ఇంటర్‌లో సైన్స్‌ గ్రూప్‌ చదివి ఉండాలి.


మ్యూజియాలజీ: ఇందులో 15 సీట్లు ఉన్నాయి. ఆర్ట్స్‌, సైన్స్‌, సోషల్‌ సైన్స్‌, హ్యుమానిటీస్‌లో 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత.


పిహెచ్‌డి: గత ఏడాదే పిహెచ్‌డికి నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఈ సంవత్సరం మార్చిలో ఇంటర్వ్యూలు జరగాల్సి ఉంది. కొవిడ్‌ కారణంగా వాయిదాపడ్డాయి. త్వరలో అభ్యర్థులకు ఇంటర్వ్యూ వివరాలను ఈమెయిల్‌ ద్వారా తెలియజేస్తారు. ఫోన్‌ చేసి కూడా చెప్పనున్నారు.


ఎంపిక

ఆన్‌లైన్‌ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పరీక్ష కాలవ్యవధి 60 నిమిషాలు. రాతపరీక్ష తేదీని తరువాత వెల్లడిస్తారు. ఇందుకోసం అభ్యర్థి తరచుగా అధికారిక వెబ్‌సైట్‌ను పరిశీలించాలి. ఆన్‌లైన్‌ ఎగ్జామ్‌లో ప్రతిభ చూపినవారిని ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. ఇది జూమ్‌/గూగుల్‌ మీట్‌ ద్వారా జరుగుతుంది. తెలుగు సహా ప్రాచీన/విదేశీ భాషల్లో ఏదైనా ఒకటి తెలిసి ఉన్న పక్షంలో ఈ కోర్సుల్లో ప్రవేశానికి అదనపు అర్హతగా పరిగణిస్తారు. అర్హతలు, ఆసక్తి ఉన్నవారు ఈమెయిల్‌ ద్వారా జూలై 31లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో అభ్యర్థి ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. హాస్టల్‌ వసతి లేదు.


వెబ్‌సైట్‌: http://nmi.gov.in/

ఈమెయిల్:ara.nmi@gov.in


Updated Date - 2020-07-22T19:45:54+05:30 IST