ఫెన్సింగ్‌కు తగిలి యువకుడి మృతి

ABN , First Publish Date - 2020-12-10T06:29:54+05:30 IST

కామవరపు కోట మండలం సాగిపాడు అటవీ ప్రాంతంలో అడవి పందుల నుంచి రక్షణ కోసం పామాయిల్‌ తోటకు ఉంచిన విద్యుత్‌ ఫెన్సింగ్‌కు తగిలి బుధవారం తెల్లవారు జామున అదే గ్రామానికి చెందిన చింతపల్లి ధర్మయ్య (24) అనే వ్యవసాయ కూలీ మృతి చెందాడు.

ఫెన్సింగ్‌కు తగిలి యువకుడి మృతి


కామవరపుకోట, డిసెంబరు 9: కామవరపు కోట మండలం సాగిపాడు అటవీ ప్రాంతంలో అడవి పందుల నుంచి రక్షణ కోసం పామాయిల్‌ తోటకు ఉంచిన విద్యుత్‌ ఫెన్సింగ్‌కు తగిలి బుధవారం తెల్లవారు జామున అదే గ్రామానికి చెందిన చింతపల్లి ధర్మయ్య (24) అనే వ్యవసాయ కూలీ మృతి చెందాడు. తడికలపూడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.


Updated Date - 2020-12-10T06:29:54+05:30 IST