మోటార్‌ సైకిల్‌ కొనివ్వలేదని యువకుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-03-13T11:28:49+05:30 IST

మోటార్‌ సైకిల్‌ కొనలేదని పురుగుల మందు తాగిన యువకుడు మృతి చెందాడు.

మోటార్‌ సైకిల్‌ కొనివ్వలేదని యువకుడి ఆత్మహత్య

పెరవలి/ఏలూరు క్రైం, మార్చి 12: మోటార్‌ సైకిల్‌ కొనలేదని పురుగుల మందు తాగిన యువకుడు మృతి చెందాడు. పెరవలి గ్రామానికి చెందిన చదలవాడ వీరకుమార్‌ (19) తండ్రి ఉపాధి నిమిత్తం దుబాయ్‌ వెళ్లాడు. తల్లి సోదరుడు, సోదరితో మేనమామ ఇంటి వద్ద ఉంటున్నారు. వీరకుమార్‌ ద్విచక్ర వాహనం కావా లని తల్లిని అడగ్గా అక్కకు వివాహం జరిగిన తరువాత కొంటానని అనడడంతో మనస్థాపంతో ఈ నెల 11న పురుగుల మందు తాగాడు.


వెంటనే అతడిని ఒక ప్రైవేటు ఆసుపత్రికి, తరువాత ఏలూరు ఆశ్రం సుపత్రికి తరలించారు. వీరకుమార్‌ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. అతడి మేనమామ యార్లగడ్డ ప్రభాకరరావు ఫిర్యాదు మేరకు పెరవలి ఏఎస్‌ఐ తాతారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చేతికందివచ్చిన కుమారుడి మృతితో తల్లి రోదన స్థానికులను సైతం కంట తడి పెట్టించింది. యువకుడు క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం కుటుంబానికి ఎంతో తీరని వేదన మిగిల్చిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-03-13T11:28:49+05:30 IST