పేదల సొంతింటి కల నెరవేర్చే దిశగా చర్యలు

ABN , First Publish Date - 2020-11-22T05:01:34+05:30 IST

పేదల సొంతింటి కల నెరవేర్చేదిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి తానేటి వనిత అన్నారు.

పేదల సొంతింటి కల నెరవేర్చే దిశగా చర్యలు

కొవ్వూరు, నవంబరు 21 : పేదల సొంతింటి కల నెరవేర్చేదిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి తానేటి వనిత అన్నారు. మంత్రి క్యాంప్‌ కార్యాలయంలో పురపాలక సం ఘం ఆధ్వర్యంలో నిర్మించిన టిడ్కో గృహా ల ఇళ్ల పట్టాలను శనివారం ఆమె పంపి ణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ పట్టణంలో జీ+3 అపార్టుమెంట్‌లో 480 నిర్మాణాలు పూర్తి చేశామని, వాటిలో 240 మందికి డబుల్‌ బెడ్‌ రూమ్‌ ప్లాట్‌ల పట్టాలను లబ్ధిదారులకు పంపిణీ చేశామన్నారు. మిగిలిన 240 సింగిల్‌ బెడ్‌ రూమ్‌ అపార్టుమెంట్‌లకు సంబంధించినవి ప్రభుత్వం నుంచి పట్టాలు వచ్చిన వెంటనే అందజేస్తా మన్నారు. కమిషనర్‌ కేటీ సుధాకర్‌, కంఠమణి రమేశ్‌, నాయకులు పాల్గొన్నారు. పట్టణంలో 14, 15, 16వ వార్డులలో ఆ మె పాదయాత్ర నిర్వహిస్తూ స్థానికుల సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. 

Read more