-
-
Home » Andhra Pradesh » West Godavari » YCP
-
ఇళ్ల పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలి : ముదునూరి
ABN , First Publish Date - 2020-11-28T05:26:34+05:30 IST
నియోజకవర్గంలో వచ్చే నెల 25న ప్రభుత్వం చేపట్టే ఇళ్ల పంపిణీ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే ప్రసాదరాజు ఆదేశించారు.

నరసాపురం టౌన్, నవంబరు 27 : నియోజకవర్గంలో వచ్చే నెల 25న ప్రభుత్వం చేపట్టే ఇళ్ల పంపిణీ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే ప్రసాదరాజు ఆదేశించారు. పలు శాఖల అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. నరసాపురం, మొగల్తూరు మండలాల్లో 8,266 మంది లబ్థిదారులకు ఇళ్ల పట్టాలు అందజేస్తామన్నారు. అవసరమైన లే–అవుట్లను సిద్ధం చేయాలన్నారు. ముందుగా డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమానికి ప్రజల నుంచి 32 వినతులందాయి. వచ్చిన సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. ఏఎంసీ చైర్మన్ స్వామి, తహసీ ల్దార్ మల్లికార్జునరెడ్డి, డీఈ పిచ్చియ్య, ఏఈ రవీంద్ర, నాగరాజు, ఉన్నారు.