26న సార్వత్రిక సమ్మె

ABN , First Publish Date - 2020-11-20T04:20:59+05:30 IST

దేశ వ్యాప్తంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 26న నిర్వహించే సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ కార్యదర్శి జవ్వా ది శ్రీనివాసరావు కోరారు.

26న సార్వత్రిక సమ్మె

పాలకొల్లు అర్బన్‌‌, నవంబరు 10 : దేశ వ్యాప్తంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 26న నిర్వహించే సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ కార్యదర్శి జవ్వా ది శ్రీనివాసరావు కోరారు. గుబ్బల సత్యనారాయణ అధ్యక్షతన గురువారం జరిగిన రైస్‌మిల్లు కార్మిక సంఘం కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లా డారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను అవలంభి స్తోందని, పోరాటం చేయడం ద్వారానే కార్మిక హక్కులు సాధించుకోవలసి ఉందన్నారు. ప్రైవేటీకరణ విధానాలు వేగవంతంగగా అమలు చేస్తున్నారని, భవిష్యత్‌లో ప్రజలపై మరింత భారం పడనున్నదని శ్రీనివాసరావు తెలిపా రు. రైతులకు నష్టం చేకూర్చే విధంగా చట్టాలను తయారు చేస్తున్నారని తెలిపారు. సమావేశంలో బొక్కా వెంకన్న, జిత్తుగ రాము, మల్లుల లక్ష్మీనారా యణ, వీరవల్లి సత్యనారాయణ, టి.సూర్యనారాయణ పాల్గొన్నారు. సమ్మె విజయవంతం చేయాలని అఖిల భారత అగ్రగామి కిసాన్‌ సభ జాతీయ కార్యవర్గ సభ్యుడు లంక కృష్ణమూర్తి భీమవరంలో ఒక ప్రకటనలో కోరారు. బీజేపీ ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. పారిశ్రామిక, వ్యవసాయరంగాల్లో ప్రతికూల విధానాలను అవలంబిస్తుందన్నారు. దేశవ్యాప్త సమ్మెకు వీవోఏలు మద్దతు తెలిపారు. మొగల్తూరులోని సుంద రయ్య భవనంలో జరిగిన సమావేశానికి బి.దుర్గ అధ్యక్షత వహించారు. సీఐ టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు తెలగంశెట్టి సత్యనారాయణ మట్లాడుతూ వివోల కు కాలపరిమితి సర్క్యులర్‌ను రద్దు చేయాలి, కనీస వేతనం ఇవ్వాలని, గ్రేడింగ్‌ పద్ధతి విడనాడి నెలకు రూ.10వేలు వేతనాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మహిళా సాధికారిత సంస్ధలో ఏళ్ళ తరబడి పనిచేస్తున్న వీరికి భరోసా కల్పించాలని డిమాండ్‌ చేశారు. దేశవ్యాప్త కార్మిక సమ్మెలో వీవోఏలు బాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు. నరసాపురం పట్టణంలోని మీరా గ్రంథాలయంలో జరిగిన సమావేశంలో సీఐటీయూ నేత కవురు పెద్దిరాజు మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత కార్మికులు రోడ్డున్న పడ్డారన్నారు. సమ్మెలో అన్ని కార్మిక సంఘాలు పెద్ద సంఖ్యలో హాజరుకావా లన్నారు. వై.చిట్టిబాబు, టి.సత్యనారాయణ, రాము, శ్రీను ఉన్నారు.

Updated Date - 2020-11-20T04:20:59+05:30 IST