అర్హులైన వర్కర్లను రెగ్యులర్‌ చేయాలి

ABN , First Publish Date - 2020-11-07T05:04:35+05:30 IST

గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాల్లో పనిచేస్తున్న అర్హులను పర్మినెంట్‌ చేయాలని డైలీవేజ్‌ వర్క ర్లు కోరారు.

అర్హులైన వర్కర్లను రెగ్యులర్‌ చేయాలి

బుట్టాయగూడెం, నవంబరు 6:గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాల్లో పనిచేస్తున్న అర్హులను పర్మినెంట్‌ చేయాలని  డైలీవేజ్‌ వర్క ర్లు కోరారు. దుద్దుకూరులో ఎమ్మెల్యే తెల్లం బాలరాజును కలిసి శుక్రవారం వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదిహే నేళ్లుగా వసతి గృహాల్లో పనిచేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నామ న్నారు. ఇతర జిల్లాల్లో డైలీవేజ్‌ వర్కర్లకు ఇస్తున్నట్టు జీతాలను ఇప్పించాల ని, రెగ్యులర్‌ చేయాలని కోరారు. ప్రభుత్వం దృష్తికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టి.వెంకటేశ్‌, గుజ్జు గంగాదేవి, తెల్లం దుర్గమ్మ, చోడే దుర్గ ఉన్నారు. 

Updated Date - 2020-11-07T05:04:35+05:30 IST