కేశఖండన బంద్‌

ABN , First Publish Date - 2020-03-19T11:22:01+05:30 IST

కరోనా వైరస్‌ను నిరోధించే కార్యక్రమంలో భాగంగా ఈనెల 20 నుంచి మార్చి 31వ తేదీ వరకు కేశఖండన శాలలు

కేశఖండన బంద్‌

20 నుంచి 31వ తేదీ వరకు

అన్ని ఆర్జిత సేవలు నిలిపివేత

ద్వారకా తిరుమల దేవస్థానం ఈవో పెద్దిరాజు


ద్వారకాతిరుమల, మార్చి 18 : కరోనా వైరస్‌ను నిరోధించే కార్యక్రమంలో భాగంగా ఈనెల 20 నుంచి మార్చి 31వ తేదీ వరకు కేశఖండన శాలలు మూసివేయనున్నట్టు ద్వారకా తిరుమల దేవస్థానం ఈవో పెద్దిరాజు అన్నారు. బుధవారం సాయంత్రం అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమా వేశంలో పలు అంశాలపై చర్చించారు. దీనిలో భాగంగా ఈనెల 20 నుంచి 31వ తేదీ వరకు అంతరాలయ దర్శనం, అన్ని ఆర్జిత సేవలు, సుప్రభాత సేవ, అష్టోత్తర పూజలు నిలిపివేయనున్నట్టు తెలిపారు. ఆన్‌లైన్‌ ద్వారా నిత్యార్జిత కల్యాణాలకు బుక్‌ చేసుకున్న వారికి పరిస్థితులు అనుకూలించిన అనంతరం అనుమ తిస్తామన్నారు.


భక్తులు సమూహంగా ఏర్పడకుండా, క్యూలైన్‌లో వచ్చే భక్తులకు చేతుల శుభ్రపరుచు కునేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. అన్నదాన ప్రసాద భవనంలో బయోమెట్రిక్‌ విధానం తాత్కాలికంగా నిలిపివేశామన్నారు. 12 సంవత్సరాల లోపు పిల్లలు,60 సంవత్సరాలు పైబడిన వారికి ప్రత్యేక మార్గాలలో స్వామివారి దర్శనం కల్పిస్తామన్నారు. ప్రసాద కౌంటర్‌ల వద్ద ఎక్కువగా జనసందోహం లేకుండా, ప్రతీచోట చేతులు శుభ్రపర్చుకునేందుకు సౌకర్యాలు కల్పించినట్టు తెలిపారు.


ప్రతీరోజు ఆయుష్‌ డిపార్ట్‌మెంట్‌తో అవగాహన కల్పిస్తున్నామని, విధి నిర్వహణలో ఒక డాక్టర్‌, ఇద్దరు ఏఎన్‌ఎంలు ఉంటారని తెలిపారు. లోక కల్యాణార్ధం సుదర్శన హోమం, మృత్యుంజయ హోమం నిర్వహించడానికి చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. సమావేశంలో ఏఈవోలు దుర్గారావు, రామానుజాచారి, నటరాజ్‌, ఎలక్ట్రికల్‌ డీఈ సూర్యనారాయణ, సిబ్బంది ఉన్నారు. 


Updated Date - 2020-03-19T11:22:01+05:30 IST