మాంసం ధరలకు రెక్కలు

ABN , First Publish Date - 2020-03-30T09:19:22+05:30 IST

పదిరోజుల క్రితం వరకు కోడి మాంసం కిలో రూ.20-30లకు విక్రయించగా ఇప్పుడు ధరలు అమాంతం

మాంసం ధరలకు రెక్కలు

పాలకొల్లు, మార్చి 29 : పదిరోజుల క్రితం వరకు కోడి మాంసం కిలో రూ.20-30లకు విక్రయించగా ఇప్పుడు ధరలు అమాంతం పెరిగిపోయాయి. కొన్ని చోట్ల కిలోకు కిలో ఉచితంగా ఇచ్చారు. లాక్‌డౌన్‌ నేపఽథ్యంలో పరిమిత సమయంలోనే అమ్మకాలు ఉండడంతో ఒక్కసారిగా మాంసాహారం ధరలకు రెక్కలు వచ్చాయి. కోడి మాంసం కిలో రూ.200, మటన్‌ కిలో రూ.900 వరకు విక్రయించారు. కోడిగుడ్డు రిటైల్‌ మార్కెట్లో రూ.6-8లకు విక్రయించారు. కిలో చేప రూ.300లు చొప్పున విక్రయించారు. ఆదివారం కావడంతో మాంసాహార ప్రియులు అధిక ధరలైనా కొనుగోలు చేశారు.

Updated Date - 2020-03-30T09:19:22+05:30 IST