మంచు కురిసే వేళలో..

ABN , First Publish Date - 2020-12-15T05:45:24+05:30 IST

చలి ప్రజలను వణికిస్తోంది. రోజురోజుకూ చలిగాలుల తీవ్రత పెరుగుతోంది.

మంచు కురిసే వేళలో..
పొలాల్లో మంచు పరదా

 (ఏలూరు రూరల్‌ )

చలి ప్రజలను వణికిస్తోంది. రోజురోజుకూ చలిగాలుల తీవ్రత పెరుగుతోంది. సోమవారం గరిష్టంగా 30.5 డిగ్రీలు, 17.0 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు డిగ్రీలు పడిపోవడంతో చలి తీవ్ర అధికంగా ఉంటోంది. సోమవారం ఉదయం 8 గంటలు అయినా పొగ మంచు తొలగలేదు. శనివారపుపేట సమీపంలోని పొలాలను మంచు పరదా కమ్మేసింది. ఉదయం పూట చలి తీవ్రత వల్ల వృద్ధులు, ఆస్తమా వ్యాధి గ్రస్తులు ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశాలున్నాయన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. చలి తీవ్రత పెరుగుతూ ఉండడంతో కరోనా వైరస్‌ విజృంభించే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 

Read more