-
-
Home » Andhra Pradesh » West Godavari » westgodavari telugumahilla
-
వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ లేదు
ABN , First Publish Date - 2020-12-15T05:32:43+05:30 IST
వైసీపీ పాల నలో మహిళలకు రక్షణ లే దని, రాష్ట్రంలో ఎక్కడ చూ సినా మహిళల హత్యలు, మానభంగాలు, వేధింపులు కన్పిస్తున్నాయని టీడీపీ ఏ లూరు పార్లమెంటు తెలుగు మహిళా అధ్యక్షురాలు చింతల వెంకటరమణ, ప్రధాన కార్యదర్శి ఉన్నమట్ల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలుగు మహిళా అధ్యక్షురాలు వెంకటరమణ
ఏలూరు ఫైర్‌స్టేషన్, డి సెంబరు 14 : వైసీపీ పాల నలో మహిళలకు రక్షణ లే దని, రాష్ట్రంలో ఎక్కడ చూ సినా మహిళల హత్యలు, మానభంగాలు, వేధింపులు కన్పిస్తున్నాయని టీడీపీ ఏ లూరు పార్లమెంటు తెలుగు మహిళా అధ్యక్షురాలు చింతల వెంకటరమణ, ప్రధాన కార్యదర్శి ఉన్నమట్ల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెంకటరమణ మాట్లాడుతూ ముఖ్య మంత్రి నియోజకవర్గంలో లింగాల మండలం పెదకూడాలలో దళిత మహిళ ను అత్యాచారం చేసి రాళ్లతో దాడి చేసినప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తి నట్టు వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఒక మహిళ హోం మినిస్టర్‌గా ఉన్న ప్పటికీ మహిళలకు న్యాయం చేయడం లేదన్నారు. మహిళలపై హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నా మహిళా కమీషన్ చైర్‌పర్సన్ ఎక్కడున్నారో అర్థం కావడం లేదన్నారు. ఎంతో మంది మహిళా ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ రాష్ట్రంలో మహిళలకు న్యాయం లేదన్నారు. రాష్ట్రంలో వైసీపీ అధికారం లోకి వచ్చినప్పటి నుంచి 400 మంది మహిళలపై హత్యలు, మానభంగాలు జరిగాయని రాష్ట్రంలో శాంతి భధ్రతలు క్షీణించాయన్నారు. మహిళా కమిటీ నాయకురాళ్ళు కడియాల విజయలక్ష్మి, బెజ్జం అచ్చాయమ్మ, వేగి లక్ష్మీ, మున్నుల నిర్మల కుమారి తదితరులు పాల్గొన్నారు.