ఇంట్లోనే న్యూ ఇయర్‌ వేడుకలు జరుపుకోండి

ABN , First Publish Date - 2020-12-31T05:08:54+05:30 IST

నూతన సంవత్సర వేడు కలను జిల్లా ప్రజలు తమ కుటుంబ సభ్యులతో ఇంట్లోనే జరుపుకుని ఆనందంగా ఉండాలని జిల్లా ఎస్పీ కె.నారాయణ నాయక్‌ సూచించారు.

ఇంట్లోనే న్యూ ఇయర్‌ వేడుకలు జరుపుకోండి

జిల్లా ఎస్పీ కె.నారాయణ నాయక్‌

ఏలూరు క్రైం, డిసెంబరు 30 : నూతన సంవత్సర వేడు కలను జిల్లా ప్రజలు తమ కుటుంబ సభ్యులతో ఇంట్లోనే జరుపుకుని ఆనందంగా ఉండాలని జిల్లా ఎస్పీ కె.నారాయణ నాయక్‌ సూచించారు. రాత్రి 10 గంటల నుంచి 1 గంట వరకూ మాత్రమే నియమ నిబంధనల ప్రకారం వేడుకలు జరుపుకోవాల న్నారు. ఎక్కడా ఎటువంటి సాంస్కృతిక కార్యక్రమాలకు అనుమతి ఇవ్వలేదన్నారు. ఎవరైనా అతిక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. అశ్లీల నృత్యాలు, బాణసంచా వినియోగం, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిం చడం చేయకూడదన్నారు.రాత్రి 10 తరువాత మ్యూజిక్‌ సిస్టమ్‌లను వినియోగించ రాదని సూచించారు. మద్యం తాగి మితిమీరిన వేగంతో వాహనాలు నడిపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలోని అన్ని ప్రధాన కూడళ్ళల్లో బ్రీత్‌ ఎనలైజర్‌తో తనిఖీలు చేస్తామని ఎవరైనా మద్యం తాగి వాహనం నడిపితే వాహనాన్ని సీజ్‌ చేస్తామన్నారు. ప్రధాన కూడళ్ళలో సీసీ కెమెరాల ద్వారా పర్య వేక్షిస్తామన్నారు. సమయం దాటి నిర్వహించే బార్లు, హోటళ్ళు, క్లబ్‌లపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో ప్రధాన కూడ ళ్ళల్లో పోలీస్‌ చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తామన్నారు.  


 ప్రశాంతంగా చేసుకోండి : కలెక్టర్‌


నూతన సంవత్సర వేడుకలు పరిమితులకు లోబడి ప్రశాంతంగా జరుపు కోవాలని జిల్లా కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొవిడ్‌ నిబంధనలను పాటించాలని, ఎటువంటి హింసాత్మక ఘటనలకు పాల్ప డకుండా ప్రశాంతంగా వేడుకలు జరుపుకోవాలని సూచించారు.వాహనాల తనిఖీకి ఏలూరులో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

Updated Date - 2020-12-31T05:08:54+05:30 IST