విధుల నుంచి సెక్యూరిటీ ఇన్‌ఛార్జి తొలగింపు

ABN , First Publish Date - 2020-12-17T05:42:23+05:30 IST

ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో సెక్యూరిటీ గార్డు ల ఇన్‌ఛార్జిగా పనిస్తున్న మల్లికార్జునరావు లైంగిక వేధింపులకు పాల్పడుతు న్నాడని ఫిర్యాదులు అందడంతో అధికారులు అతన్ని తొలగించారు.

విధుల నుంచి సెక్యూరిటీ ఇన్‌ఛార్జి తొలగింపు

ఏలూరు క్రైం, డిసెంబరు 16: ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో సెక్యూరిటీ గార్డు ల ఇన్‌ఛార్జిగా పనిస్తున్న మల్లికార్జునరావు లైంగిక వేధింపులకు పాల్పడుతు న్నాడని ఫిర్యాదులు అందడంతో అధికారులు అతన్ని తొలగించారు. ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో సెక్యూరిటీ గార్డులు 50 మంది వరకూ పని చేస్తుండగా వారిలో మహిళలూ ఉన్నారు. రాత్రి వేళ మహిళలకు డ్యూటీలు వేయడమే కాకుండా అర్ధరాత్రి వేళ వేధింపులకు గురి చేస్తున్నాడని రాతపూర్వకంగా అధి కారులకు ఫిర్యాదులు అందడంతో మల్లికార్జునరావును ఆస్పత్రి విధుల నుంచి తొలగించారు. ఈ విషయంపై డీసీహెచ్‌ఎస్‌, ఆస్పత్రి మెడికల్‌ సూపరింటెం డెండ్‌ డాక్టర్‌ ఏవీఆర్‌ మోహన్‌ను వివరణ కోరగా ఫిర్యాదులు వచ్చాయని అతన్ని ఆస్పత్రి విధులకు రానీయకుండా నిలిపివేశామని, సంబంధిత సెక్యూ రిటీ కంపెనీకి తెలిపినట్టు పేర్కొన్నారు.  

Updated Date - 2020-12-17T05:42:23+05:30 IST