రంగంలోకి దిగారు..
ABN , First Publish Date - 2020-12-12T05:03:29+05:30 IST
శనివారపుపేటలో ఆక్రమణలు తొలగించేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.
ఏలూరు రూరల్, డిసెం బరు 11 : శనివారపుపేటలో ఆక్రమణలు తొలగించేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇటీవల ‘ఆంధ్ర జ్యోతి’లో ‘దర్జాగా కబ్జా’ శీర్షికన కథనం ప్రచురితమైంది. ఆక్రమణలకు గురైన పంచాయతీ స్థలాలు, అనుమతులు లేకుండా నిర్మించిన కట్టడాలను ఆర్‌ఎస్ నెంబర్లతో సహా కథనాన్ని ప్రచురించింది. దీనిపై అధికారులు స్పం దించారు. ఆక్రమణలను గుర్తించి ఇప్పటికే నోటీసులు అందజేశారు. వారం రోజుల్లో స్పందించకుంటే ఆక్రమణలు తొలగించేందుకు సమాయత్తం అవు తున్నారు.