ఎలా బతకాలి...సారూ..!

ABN , First Publish Date - 2020-12-31T05:12:19+05:30 IST

నెలలు తరబడి జీతా లు ఇవ్వరు. అలవెన్సులు అసలే లేవు. రెక్కాడితే కాని డొక్కా డని కుటుంబాలు. ఎలా బతకాలి అంటూ మునిసిపల్‌ కాం ట్రాక్టు కార్మికులు ఆకలి కేకలు వేస్తున్నారు.

ఎలా బతకాలి...సారూ..!

 అందని ఆగస్టు, సెప్టెంబరు జీతాలు

మునిసిపల్‌ కాంట్రాక్టు కార్మికుల ఆకలి కేకలు


ఏలూరు టూటౌన్‌, డిసెంబరు 30 : నెలలు తరబడి జీతా లు ఇవ్వరు. అలవెన్సులు అసలే లేవు. రెక్కాడితే కాని డొక్కా డని కుటుంబాలు. ఎలా బతకాలి అంటూ మునిసిపల్‌ కాం ట్రాక్టు కార్మికులు ఆకలి కేకలు  వేస్తున్నారు. అయినా యాజమాన్యం పట్టించు కోవడం లేదు. ఎముకలు కొరికే చలిలో తెల్లవారు జామున రోడ్డులపైకి వచ్చి పారిశుధ్య పనులు చేస్తున్నాం. ఉదయాన్నే ప్రజలు నిద్ర లేచేటప్పటికి తాగు నీరు అందిస్తున్నాం. అయినప్పటికీ నెల వారీ జీతాలు ఇవ్వడం లేదు. అధి కారులు, పర్మినెంట్‌  ఉద్యోగులకు ఠంఛన్‌గా 1వ తేదీనే జీతాలు ఇస్తారు. కష్ట పడే వారికి ఎందుకు జీతాలు ఇవ్వరంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంజ నీరింగ్‌ విభాగంలో కాంట్రాక్టు కార్మికులకు రెండు నెలలుగా 180 మంది కార్మి కులకు ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబరు నెలల జీతాలు ఇంతవరకూ ఇవ్వలేదు. మునిసిపల్‌ స్కూల్‌ స్వీపర్లకు మూడు నెలల నుంచి జీతాలు లేవు. నెలకు కేవలం నాలుగు వేల రూపాయలే ఇస్తున్న ప్పటికీ స్వీపర్లకు అవి కూడా నెల ల తరబడి ఇవ్వకపోతే ఎలా బతకాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పారిశుధ్య కార్మికులు 360 మందికి ఐదు నెలలుగా హెల్త్‌ బకాయిలు ఇవ్వడం లేదు. నాలు గు నెలలుగా పీఎఫ్‌, ఈఎస్‌ఐలు జమ చేయడం లేదు. దీంతో రెండు మూడు నెలలుగా మునిసిపల్‌ కార్మికులు ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించక పోవ డం దురదృష్టకరమేనన్నారు. వెంటనే బకాయి వేతనాలు, అలవెన్సులు చెల్లిం చాలని డిమాండ్‌ చేస్తున్నారు.


 నెలవారీ జీతాలు చెల్లిస్తున్నాం

 డి.చంద్రశేఖర్‌,  కమిషనర్‌, నగరపాలక సంస్థ


మునిసిపల్‌ కాంట్రాక్టు కార్మికులకు ఏ నెలకు ఆనెల జీతాలు చెల్లిస్తున్నాం. సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా జీతాలు చెల్లిం చడంతో కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇంజ నీరింగ్‌ కార్మికుల సెప్టెంబరు, ఆగస్టు వేతనాలు త్వరలో చెల్లిస్తాం. పారిశుధ్య కార్మికులకు హెల్త్‌ అలవెన్సులు చెల్లించడానికి ప్రయ త్నాలు చేస్తున్నాం. స్కూల్‌ స్వీపర్లకు బకాయి వేతనాలు చెల్లిస్తాం.


పండగ పూట పస్తులు 

లావేటి కృష్ణ, కాంట్రాక్టు కార్మికుడు


నెల నెలా జీతాలు ఇవ్వకపోతే ఎలా బతకాలి. దసరా, దీపావళి, క్రిస్మస్‌ పండుగల రోజుల్లో కూడా పస్తులున్నాం. ఉదయాన్నే లేచి పారిశుధ్య పనులు చేసి ప్రజల  ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నాం. మాగోడు ఎవ్వరు పట్టించుకోవడం లేదు. 


హెల్త్‌ బకాయిలు ఇవ్వలేదు 

 జాన్‌బాబు, పారిశుధ్య కార్మికుడు 


పారిశుధ్య కార్మికులకు ఐదు నెలల హెల్త్‌ బకాయిలు ఇవ్వలేదు. నెలకు ఆరు వేలు చొప్పున ఒక్కొక్కరికి 30 వేలు యాజమాన్యం బకాయి పడింది. వెంటనే అలవెన్సులు చెల్లించాలి 18 నెలల నుంచి కొబ్బరినూనె, సబ్బులు ఇవ్వడం లేదు. అప్పులు చేసి మేమే కొనుక్కుంటున్నాం. నెల నెలా జీతాలు కూడా ఇవ్వకపోతే ఎలా బతుకుతాం.   



బకాయిలు వెంటనే చెల్లించాలి

సోమయ్య, మునిసిపల్‌ వర్కర్స్‌  యూనియన్‌ గౌరవాధ్యక్షుడు

ఇప్పటికైనా మునిసిపల్‌ కాంట్రాక్టు కార్మికులకు బకాయిలు, వేతనాలు చెల్లించాలి. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. నూతన సంవత్సరంలో సంక్రాంతి పండుగ లోపైనా చెల్లించాలి. కార్మి కులు జీతాలు, అలవెన్సులు లేక అప్పుల పాలయ్యారు. యాజమాన్యం స్పందించాలి. 

Updated Date - 2020-12-31T05:12:19+05:30 IST