కమిటీలతో సరిపెట్టారు

ABN , First Publish Date - 2020-12-20T05:17:14+05:30 IST

ఏలూరులో అంతుచిక్కని వ్యాధి సోకి వందలాది మంది అస్వస్థతకు గురైతే సీఎం జగన్‌ పరామర్శించి కమిటీలు వేసి చేతులు దులుపుకున్నారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ వ్యాఖ్యానించారు.

కమిటీలతో సరిపెట్టారు
తంగెళ్లమూడిలో పరామర్శిస్తున్న జనసేన నేత మనోహర్‌

 

అంతుచిక్కని వ్యాధి బాధితులకు జనసేన నేత మనోహర్‌ పరామర్శ


ఏలూరు కార్పొరేషన్‌, డిసెంబరు 19 : ఏలూరులో అంతుచిక్కని వ్యాధి సోకి వందలాది మంది అస్వస్థతకు గురైతే సీఎం జగన్‌ పరామర్శించి కమిటీలు వేసి చేతులు దులుపుకున్నారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ వ్యాఖ్యానించారు. శనివారం ఏలూరు నగరం తంగెళ్ళమూడి ప్రాంతంలో అంతుచిక్కని వ్యాధి బారిన పడి చికిత్స పొంది వారి నివాసాల్లో ఉంటున్న బాధితులను శనివారం పరామర్శించారు. బాధితులను అడిగి వ్యాధి ఏ రకంగా వచ్చిందో పరిణామాలపై పూర్తిగా ఆరా తీశారు. నగరంలోని పారిశుఽధ్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుధ్యం అధ్వానంగా ఉందని తేటతెల్లమైందన్నారు. అంతుచిక్కని వ్యాధి సోకి రెండు వారాలు దాటినా నగరంలో నేటికీ  పారిశుధ్యం మెరుగుపర్చలేక పోయారన్నారు. మురుగుకాల్వలు, వ్యర్ధాలు, నివాసాలకు చేరువ లో ఉంటే అంతుచిక్కని వ్యాధులు రాకుండా ఉంటాయా అంటూ పేర్కొన్నారు. వైసీపీ నాయ కులు సమస్యను పక్కదారి పట్టించార న్నారు. ల్యాబ్‌ల రిపోర్టులను ఇప్పటికీ ప్రభు త్వం బయట పెట్టక పోవ డం ఏమిటని ప్రశ్నించారు. వందేళ్ళ క్రితం వేసిన పైపు లైన్లే ఇప్పటికీ నగరంలో ఉన్నాయన్నారు. నివర్‌ తుఫాను, అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జనసేన ఏలూరు ఇన్‌చార్జ్‌ రెడ్డి అప్పలనాయుడు, పార్టీ జిల్లా నాయకులు ఇర్రంకి సూర్యారావు, కనకరాజు సూరి, నౌడు వెంకటరమణ, రామచంద్ర రావు, ఘంటశాల వెంకటలక్ష్మి, మేకా ఈశ్వరయ్య పాల్గొన్నారు.

Updated Date - 2020-12-20T05:17:14+05:30 IST