లబ్ధిదారుల జాబితాలతో సిద్ధంగా ఉండాలి : జేసీ
ABN , First Publish Date - 2020-12-18T05:14:22+05:30 IST
ఈనెల 25వ తేదీన ఇళ్ల పట్టాల పంపిణీకి లబ్ధిదా రుల జాబితాలతో అధికారులు సిద్ధంగా ఉండాలని జేసీ హిమాన్షు శుక్లా అన్నారు.

ఏలూరు సిటీ, డిసెంబరు 17: ఈనెల 25వ తేదీన ఇళ్ల పట్టాల పంపిణీకి లబ్ధిదా రుల జాబితాలతో అధికారులు సిద్ధంగా ఉండాలని జేసీ హిమాన్షు శుక్లా అన్నారు. గృహనిర్మాణ శాఖ ఏఈలు, డీఈలతో గురువారం ఆయన సమీక్షించారు. నియోజక వర్గాల వారీగా పట్టాల మంజూరుకు సంబంధించి వివరాలు అడిగారు. జిల్లాలో ఫేజ్–1లో 1,70,699 పట్టాల పంపిణీ చేయనున్నందున లబ్ధ్దిదారుల జాబితా సిద్ధం చేయాలన్నారు. రిజిస్ట్రేషన్, పొజిషన్ సర్టిఫికేట్లు జాబితా సిద్ధం చేసుకోవాలన్నారు. హౌసింగ్ పీడీ రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.