గ్రూప్‌–1 మెయిన్స్‌కు తొలిరోజు 31 మంది గైర్హాజరు

ABN , First Publish Date - 2020-12-15T05:51:37+05:30 IST

వట్లూరు రామచంద్ర ఇంజనీరింగ్‌ కాలేజీలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి.

గ్రూప్‌–1 మెయిన్స్‌కు తొలిరోజు 31 మంది గైర్హాజరు

ఏలూరు, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి) : వట్లూరు రామచంద్ర ఇంజనీరింగ్‌ కాలేజీలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు క్వాలిఫయింగ్‌ పరీక్ష అయిన తెలుగు లాంగ్వేజ్‌ పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు 31 గైర్హాజరయ్యారు. జిల్లా నుంచి మొత్తం 216 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు హాజరు కావాల్సి ఉండగా తొలిరోజు 185 మాత్రమే హాజరయ్యారు. కాగా మంగళవారం మరో క్వాలిఫయింగ్‌ పేపర్‌ ఇంగ్లీషు పరీక్ష జరగనుంది.

Updated Date - 2020-12-15T05:51:37+05:30 IST