-
-
Home » Andhra Pradesh » West Godavari » westgodavari establish political party
-
రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహం
ABN , First Publish Date - 2020-12-29T05:27:56+05:30 IST
బీసీ లు రాజ్యాధికారం దిశగా రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తు న్నట్లు ఏపీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసన శంకరరావు అన్నారు.

ఏపీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శంకరరావు
కొవ్వూరు, డిసెంబరు 28: బీసీ లు రాజ్యాధికారం దిశగా రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తు న్నట్లు ఏపీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసన శంకరరావు అన్నారు. కొవ్వూరు రెవెన్యూ డివిజన్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు తాతా కృష్ణారావు నివాసంలో సోమవారం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా శంకరరావు మాట్లాడుతూ రాజకీయ పార్టీలు బీసీలను ఓటు బ్యాంకుగా పరిగణిస్తూ చిన్నచూపు చూస్తున్నాయన్నారు. నియోజకవర్గాలలో సమావేశాలు ఏర్పాటుచేసి అణచివేతకు గురి అవుతున్న ఎస్‌సీ, ఎస్‌టీ, మైనారిటీలతో కలిసి సొంత రాజకీయ శక్తిగా ముందుకు రావలిసిన సమయం ఆసన్నమైందన్నారు.