అంతుపట్టని అవశేషాలెన్నో!

ABN , First Publish Date - 2020-12-17T06:21:57+05:30 IST

కొందరేమో సీసం, నికెల్‌ ఉందని, ఇంకొందరు పురుగు మందుల అవశేషాలున్నాయని, మరి కొందరు తాగునీటిలో అన్ని రసాయనిక అవశేషాలు కలిశా యంటూ రకరకాలుగా స్పందించారు.

అంతుపట్టని   అవశేషాలెన్నో!

భిన్నంగా నమూనాల సేకర ణ ఫలితాలు

ఏలూరులో గాలి దగ్గర నుంచి తాగునీటి వరకూ పరీక్షలు 

ఎటూ తేల్చలేదు.. మొదట్లో ఇచ్చిన సారాంశమే పునరావృతం

సీసం, నికెల్‌ ఉన్నాయి.. లేవు అంటూ పరస్పర విరుద్ధ ప్రకటనలు

పురుగు మందుల అవశేషాలే కారణమని ప్రాథమిక నిర్ధారణ

ఎయిమ్స్‌, ఎన్‌ఐసీటీలకులోతైన విశ్లేషణ బాధ్యత

ప్రైవేటు ల్యాబ్‌లదీ ఇంకోదారి

తాగు నీటిలో ప్రమాదకర రసాయనాలు ఉన్నాయని వెల్లడి

చిట్టచివరకు అంతా సస్పెన్సే 


(ఏలూరు–ఆంధ్రజ్యోతి): 

కొందరేమో సీసం, నికెల్‌ ఉందని, ఇంకొందరు పురుగు మందుల అవశేషాలున్నాయని, మరి కొందరు తాగునీటిలో అన్ని రసాయనిక అవశేషాలు కలిశా యంటూ రకరకాలుగా స్పందించారు. కానీ ఈ వింత రోగం ఎందుకు వచ్చిందో నిర్ధారించలేక పోయారు. ఈ అంతుపట్టని వ్యాధిపై ఇప్పటికి రెండు వారాలు గడుస్తున్నా అన్నీ శేషప్రశ్నలే మిగిలాయి. 

ఏలూరులో వందలాది మందిని తీవ్ర అస్వస్థతకు గురిచేసిన వింత వ్యాధి గుట్టు పూర్తిగా వీడలేదు. ఈ అంతుచిక్కని వ్యాధి అవశేషాలు ఏమిటో ఇంకా తేలలేదు. కేంద్ర రాష్ట్రాలకు చెందిన అనేక సంస్థలు వందలాది మంది నుంచి రక్తం శాంపిల్స్‌ సేకరించాయి. నీరు, కూరగాయలు, బియ్యం, పాలు, ధాన్యం తదితర ఆహార పదార్థాలను పరీక్షించాయి. ఢిల్లీ, హైదరాబాద్‌, పుణె తదితర పేరొందిన అన్ని ల్యాబ్‌లోనూ రోజుల తరబడి పరిశోధించాయి. నాలుగు రోజుల క్రితం ఇచ్చిన నివేదికల్లో ప్రాథమికంగా తేల్చిన అంశాలే తాజా పరిశోధనలోనూ పునరావృతమయ్యాయి. దర్యాప్తు  సంస్థలన్నీ బుధవారం సీఎం జగన్‌ జరిపిన సమీక్షలో నివేదించాయి. 


ఏలూరు నగరంలో లక్షలాది మందికి కంటి మీద కునుకు లేకుండా చేసిన వింత వ్యాధికి పూర్తి విరుగుడు కనిపెట్టలేక పోయారు. పలు అధ్యయన సంస్థలు సాంకేతిక నైపుణ్యాన్ని తోడేసుకుని పరిశోధించినా తుది రోగ నిర్ధారణ చేయలేకపో యారు. ఈ రోగం వెనుక నిగూఢత ఏదో దాగే ఉందన్న అను మానాలు అలాగే మిగిలాయి. కేంద్ర అధ్యయన సంస్థలు, నిపు ణుల కమిటీలు, వాటికితోడు రాష్ట్రస్థాయిలో ఉన్న సంస్థలు, ప్రైవేటు ల్యాబ్‌లు ఎవరంతటికి వారుగా పరిశోధనలకు దిగా రు. నమూనాలను ల్యాబ్‌లకు పంపారు. ఫలితాల కోసం ఇంత కాలం వేచి చూశారు. కానీ పలు అధ్యయన సంస్థలు ఇంతకు ముందు ఏదైతే నివేదించాయో తిరిగి వాటినే మరోమారు బుధవారం జరిగిన సీఎం సమీక్షలోనూ పునరావృతం చేసి తేల్చాల్సింది ఇంకా ఎంతో ఉందన్నట్లు చెప్పాయి.  

ప్రఖ్యాత ఎయిమ్స్‌(ఢిల్లీ) అధ్యయన బృందం బాధితులు, వారి సంబంధీకుల నుంచి రక్తం, పాలు, ఇతర నమూనా లను పెద్దఎత్తున సేకరించి అనేక కోణాల్లో పరిశోధనలు చేసింది. రక్తంలో లెడ్‌, పాలల్లో నికెల్‌ వంటి లోహాలు కన్పించాయని అస్వస్థతకు ఒకింత కారణం ఇదేనేమోనని  స్పష్టం చేసింది. ఆర్గానో క్లోరిన్‌ వల్ల ఏలూరులో ఇలాంటి పరిస్థితి దాపురించిందని నివేదించింది.

నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ(ఎన్‌ఐసీటీ) మరో రకం నివేదిక ఇచ్చింది. తాగు నీటిలో సీసం, ఆర్గానిక్స్‌, నికెల్‌ తదితర లోహాలు లేవని పురుగు మందుల అవశేషా లు కొద్దిగా కనిపించాయంటూ రహస్యం బయటపెట్టింది. 

ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యుహెచ్‌వో) మరో రీతిలో స్పం దించింది. ఒకవేళ పురుగు మందు అవశేషాలు మానవ శరీరంలోకి ఏరూపంలో ప్రవేశించాయో కనుగొంటే రహ స్యం చేధించవచ్చునన్నట్లు ప్రభుత్వానికి నివేదించింది. 

నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రీషన్‌(ఎన్‌ఐఎన్‌) టమో టా, వంకాయల్లో పురుగు మందుల అవశేషాలు కనిపిం చాయని వీటి కారణంగానే ఏలూరులో అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయన్న భావన వ్యక్తం చేసింది. వీటిని లోతట్టుగా మరింత శోధించాలని చెప్పింది. ఇదే విషయా న్ని ప్రాథమికంగా ఇంతకు ముందే ఎన్‌ఐఎన్‌ తన నివేదిక లో పేర్కొని తుదిగా ఈ నిర్ణయానికే వచ్చింది. 

నగర వాసుల్లో వైరస్‌ ప్రభావం ఏదీ తమకు కనిపించలే దని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐడీ, పుణె) సంస్థ తన అధ్యయనంలో తేల్చి చెప్పింది. హైదరాబాద్‌కు చెందిన సీసీఎంబీ సంస్థ నీరు, ఆహారంలో వైరస్‌ బ్యాక్టీరి యా లేవంటూ రహస్యం వెల్లడించింది.

 ‘ఏలూరులో గాలి సాధారణం, భూగర్భ జలాలను పరిశీలి స్తే పాదరసం(మెర్క్యురీ) తప్ప మిగతా లోహాలన్నీ పరి మిత స్థాయిలోనే ఉన్నాయి. వ్యర్థ పదార్థాలు కాల్చడం వల్లే ఏలూరులో ఈ తరహా పరిస్థితి తలెత్తి ఉండవచ్చు’ అని నేషనల్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీరింగ్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూ ట్‌(ఎన్‌ఈఈఆర్‌ఐ) మరో కోణంలో స్పందించింది. ఈ మేరకే లోతట్టు నివేదిక సమర్పించినట్లు చెబుతున్నారు. 


మరిన్ని పరిశోధనలు జరగాలి

పురుగు మందుల అవశేషాలు మానవ శరీరంలోకి ఎలా ఎగబాకాయో పరిశోధన జరగాలి. దీర్ఘకాలిక సేంద్రీయ పద్ధ తులపై ప్రజల్లో మరింత అవగాహన పెరగాలి. భవిష్యత్తులో ఏలూరు తరహాలో వింత వ్యాధులు బయటపడినప్పుడు ఏం చేయాలో ఇప్పటి నుంచే నిర్ధారణకు రావాలని ఎయిమ్స్‌ మం గళగిరి బృందం తాజాగా ప్రభుత్వానికి మరో నివేదిక ఇచ్చింది. ఇలా అన్ని అధ్యయన సంస్థలు నమూనాలను ల్యాబ్‌లకు పం పి నివేదికలు రప్పించి తమ అభిప్రాయాలను వెల్లడించాయి. బాధితుల రక్త నమూనాల్లో ఆర్గానోక్లోరో, ఆర్గానోఫాస్పరస్‌ ఉం దని ఐఐసీటీ నిర్ధారించింది. ఇంకో కోణంలో అనేక ప్రైవేటు ల్యాబ్‌లు రంగంలోకి దిగి తాగునీటిని పరీక్షించాయి. ఏలూరు లో తాగే నీటిలో ప్రమాదకర రసాయనాలు లేకపోలేదని ఒక నిర్ధారణకు వచ్చాయి. మొదట్లో అనుకున్నట్లు, ప్రభుత్వానికి నివేదించినట్లు ఆహారంలో పాదరసం, రక్త నమూనాల్లో సీసం, నికెల్‌ వంటి లోహాలు కనిపించినట్లు నివేదించడాన్ని బట్టి చూ స్తుంటే ఎందుకు తుది నివేదిక రూపొందించలేకపోయారనే ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పటికే అధ్యయన సంస్థలు సమర్పించి న నివేదికలపై ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి కమిటీ మరో రెండు రోజులపాటు మరింత లోతుగా శోధించ బోతోంది. ఆ తరువాతే ఏలూరు వింత వ్యాధికి కారణాలేంటో చెబుతారని ప్రభుత్వం వెల్లడించింది. అయితే అంశాల్లో అటో ఇటో తేల్చేందుకు సుదీర్ఘ కసరత్తు, విశ్లేషణ బాధ్యతను ఢిల్లీ ఎయిమ్స్‌ బృందానికి, ఐఐసీటీకి రాష్ట్ర ప్రభుత్వం తుది బాధ్యతలు అప్పగించి దాదాపు చేతులు దులుపుకున్నంత పనిచేసింది.


నాలుగు రోజులుగా అంతా ప్రశాంతం

ఏలూరు క్రైం, డిసెంబరు 16 : నగరంలో నాలుగు రోజులు వింత వ్యాధి కేసులు నమోదు కాకపోవడంతో దీని బారి నుంచి బయట పడినట్టేనని వైద్య వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంతుపట్టని వ్యాధి ఈ నెల 5వ తేదీ మొదటి కేసు రాగా 12న చివరి కేసు నమోదైంది. మొత్తం 615 మంది ఈ వ్యాధి బారినపడగా ఒకరు మరణించారు. విజయవాడ, గుంటూరుకు 35 మందిని రిఫర్‌ చేయగా, 34 మంది పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జి కాగా, విజయవాడ ఆసుపత్రిలో ఒకరు మాత్రమే ప్రస్తుతానికి ఉన్నారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో సాధారణ వైద్య సేవలు ప్రారంభించారు. నగర ప్రజలు తమ కార్యక్రమాలను చేస్తున్నారు. వింత వ్యాధికి భయపడి పొరుగూర్లు వెళ్లిన వారు ఒక్కొక్కరుగా వస్తున్నాయి. నగరంలో వ్యాపార కార్యకలాపాలు జోరందుకున్నాయి.

Updated Date - 2020-12-17T06:21:57+05:30 IST