రుణాలు, ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని వైసీపీ నాయకుల అక్రమ వసూళ్లు

ABN , First Publish Date - 2020-12-31T05:00:31+05:30 IST

ఎస్సీ కార్పొరేషన్‌ నుం చి రుణాలు ఇప్పిస్తామని, ఇళ్ళ స్థలాలు మంజూరు చేయిస్తామని కొంద రు వైసీపీ నాయకులు పేదల నుంచి అక్రమ వసూళ్లు చేస్తున్నారని ఎమ్మా ర్పీఎస్‌ నాయకుడు టి.రమేశ్‌ ఆరో పించారు.

రుణాలు, ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని  వైసీపీ నాయకుల అక్రమ వసూళ్లు
కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తున్న నడిపల్లి గ్రామస్థులు

కలెక్టరేట్‌ వద్ద నడిపల్లి గ్రామస్థుల ధర్నా 

 ఏలూరు టూటౌన్‌/పెదవేగి, డి సెంబరు 30 : ఎస్సీ కార్పొరేషన్‌ నుం చి రుణాలు ఇప్పిస్తామని, ఇళ్ళ స్థలాలు మంజూరు చేయిస్తామని కొంద రు వైసీపీ నాయకులు పేదల నుంచి అక్రమ వసూళ్లు చేస్తున్నారని ఎమ్మా ర్పీఎస్‌ నాయకుడు టి.రమేశ్‌ ఆరో పించారు. కలెక్టర్‌ కార్యాలయం వద్ద బుధవారం నడిపల్లి గ్రామస్థులు ధర్నా నిర్వహించి కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన ఎం.రవీంద్ర మాట్లాడుతూ గ్రామంలో వైసీపీ నాయకులు మాదిగ కా ర్పొరేషన్‌ నుంచి రుణాలు ఇప్పిస్తామని  వలంటీర్ల ద్వారా పేదల వద్ద నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. అనర్హులైన వారికి, సొంతిళ్లు కలిగిన వారికి కూడా ఇళ్ల స్థలాలు ఇస్తామని ఒక్కొక్కరి నుంచి రూ.ఐదు వేలు నుంచి రూ.పది వేలు వరకూ వసూలు చేస్తున్నార న్నారు. ప్రస్తుతం ఇచ్చే ఇళ్ల స్థలాల్లో ఎంతో మంది అనర్హులు ఉన్నారని చాలా మందికి సొంతిళ్లు ఉన్నాయ న్నారు. దీంతో అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు దూరమ వుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  అర్హులైన పేదలకు న్యాయం చేయాలని కోరారు. ఈ మేరకు రెవెన్యూ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌, జిల్లా కలెక్టర్‌ ముత్యాలరాజుకు, ఆర్డీవోకు వినతిపత్రాలు సమర్పించామన్నారు. కార్యక్రమంలో ఎన్‌.రాజేశ్‌, ఎం.వీరవెంకటే శ్వరరావు, పి.రమేశ్‌, పి.చిన్ని, కె.రాజు పాల్గొన్నారు.  

Updated Date - 2020-12-31T05:00:31+05:30 IST