-
-
Home » Andhra Pradesh » West Godavari » westgodavari dhara at telecom office
-
రైతుల పట్ల కనికరం లేదు
ABN , First Publish Date - 2020-12-20T05:03:00+05:30 IST
దేశ ప్రధాని మోదీకి దేశంలో రైతుల కంటే రిలయన్స్ అంబానీయే ఎక్కువ అన్నట్టు ఆయన వైఖరి ఉందని వామ పక్షాల నాయకులు విమర్శించారు.

టెలికం కార్యాలయం వద్ద వామపక్షాలు, కాంగ్రెస్ ధర్నా
ఏలూరు కార్పొరేషన్, డిసెంబరు 19 : దేశ ప్రధాని మోదీకి దేశంలో రైతుల కంటే రిలయన్స్ అంబానీయే ఎక్కువ అన్నట్టు ఆయన వైఖరి ఉందని వామ పక్షాల నాయకులు విమర్శించారు. కేంద్రం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీలో చేస్తున్న రైతు సంఘాల పోరా టాలకు మద్దతుగా శనివారం టెలికం కార్యాలయం వద్ద వామపక్షాలు, కాంగ్రె స్, రైతు సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా అధికార ప్రతినిధి యు.వెంకటేశ్వరరావు, సీపీఎం నగర కార్య దర్శి పి.కిషోర్, కాంగ్రెస్ ఏలూరు ఇన్‌చార్జి రాజనాల రామ్మోహన్‌రావు, రైతు సంఘ నాయకులు కె.శ్రీని వాస్ మాట్లాడుతూ 23 రోజులుగా ఢిల్లీలో రైతులు నూతన వ్యవసాయ చట్టా లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పోరాటం చేస్తుంటే రైతుల సమస్య లను పట్టించుకోకుండా మోదీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, సీపీఎం, న్యూడెమోక్రసీ, ఇఫ్టూ, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.