ఢిల్లీ రైతులకు మద్దతుగా సీపీఎం దీక్షలు

ABN , First Publish Date - 2020-12-29T05:23:05+05:30 IST

ఢిల్లీలో రైతు లకు మద్దతుగా సీపీఎం నాయకులు రిలే దీక్షలకు దిగారు.

ఢిల్లీ రైతులకు మద్దతుగా సీపీఎం దీక్షలు
బుట్టాయగూడెంలో దీక్షలు చేస్తున్న ప్రజాసంఘాల నాయకులు

జీలుగుమిల్లి, డిసెంబరు 28:కాగితాలపై హామీలు కాకుండా రైతులకు కనీస మద్దతు ధర చట్టం చెయ్యాలని సీపీఎం మండల కార్యదర్శి తెల్లం దుర్గారావు అన్నారు. ఢిల్లీలో రైతు లకు మద్దతుగా సీపీఎం  నాయకులు రిలే దీక్షలకు దిగారు. ఈ క్రమంలో రైతులకు ఏఎంసీ మార్కెట్ల వల్ల ఉపయెగం ఉం డడం లేదన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం  నాయకులు జానకి రామిరెడ్డి, సీతారామయ్య, రాజమండ్రి దానియేలు, నేలటూరి అప్పారావు పాల్గొన్నారు.

బుట్టాయగూడెం: కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా సీపీఎం, ఏపీ వ్యవసాయ కార్మిక సం ఘం, ఏపీ గిరిజన సంఘం, సీఐటీయూ ఆధ్వర్యంలో బుట్టా యగూడెం బస్టాండ్‌ ఎదురుగా రిలే దీక్షలు చేపట్టారు. ఈ నెల 30 వరకు దీక్షలు జరుగుతాయని గిరిజన సంఘం నాయకుడు తెల్లం రామకృష్ణ తెలిపారు.

టి.నరసాపురం: ఢిల్లీలో జరుగుతున్న రైతుల దీక్షలకు మద్దతుగా అంబేడ్కర్‌ సెంటరులో సీపీఎం, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు రీలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి తుమ్మల సత్యనారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభు త్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ, విద్యుత్‌ చట్టాలను రద్దు చెయ్యాలన్నారు. 


Updated Date - 2020-12-29T05:23:05+05:30 IST