ఉద్యోగ భద్రత కల్పించండి

ABN , First Publish Date - 2020-12-27T04:49:18+05:30 IST

కొవిడ్‌ ఆస్పత్రుల్లో, కొవిడ్‌ క్వారెంటైన్‌ సెంటర్లలో పని చేస్తున్న సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ కలెక్టరేట్‌ వద్ద శనివారం రిలే దీక్షలు చేపట్టారు.

ఉద్యోగ భద్రత కల్పించండి
కలెక్టరేట్‌ వద్ద దీక్షలు చేపట్టిన కొవిడ్‌ ఉద్యోగులు

ఏలూరు కలెక్టరేట్‌, డిసెంబరు 26 : కొవిడ్‌ ఆస్పత్రుల్లో, కొవిడ్‌ క్వారెంటైన్‌ సెంటర్లలో పని చేస్తున్న సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ కలెక్టరేట్‌ వద్ద శనివారం  రిలే దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు వురు ఉద్యోగులు మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేసిన స్టాఫ్‌నర్స్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఎఫ్‌ఎన్‌వో, ఎంఎన్‌వోలకు బకాయి వేతనాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కరోనా ఉధృతంగా ఉన్న సమయంలో కుటుంబాలను సైతం వదులుకుని ప్రాణాలు లెక్క చేయకుండా సేవలందించారన్నారు. ఇప్పటి వరకూ వేతనాలు పూర్తిగా ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. కరోనా సమయలో ఎన్నో సేవలందించిన సిబ్బంది సేవలను ప్రభుత్వం గుర్తించాలని, కొవిడ్‌ విధుల్లో ఉన్న సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు.  ఈ దీక్షల్లో రామరాజు, సురేష్‌, నాగమణి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-27T04:49:18+05:30 IST