సంప్రదాయం పేరిట పందేలు నిర్వహిస్తే చర్యలు
ABN , First Publish Date - 2020-12-31T05:02:12+05:30 IST
సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాల ము సుగులో కోడి పందేలు నిర్వహిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు ఎస్పీ ఏవీ సుబ్బరాజు అన్నారు.

అదనపు ఎస్పీ ఏవీ సుబ్బరాజు
ఏలూరు క్రైం, డిసెంబరు 30 : సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాల ము సుగులో కోడి పందేలు నిర్వహిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు ఎస్పీ ఏవీ సుబ్బరాజు అన్నారు. జిల్లా ఎస్పీ కె.నారాయణ నాయక్ ఆదేశాల మేరకు మహిళలు, విద్యార్థినులు, పోలీసులు కలిసి ఏలూ రులో భారీ ర్యాలీని బుధవారం నిర్వహించారు. ఈ ర్యాలీ ఏలూరు సురేష్‌చంద్ర బహుగుణ స్కూలు నుంచి ఆస్పత్రి మీదుగా ఫైర్‌స్టేషన్ వరకు పలు ప్రాం తాల్లో నిర్వహించారు. వందలాది మంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా అదనపు ఎస్పీ సుబ్బరాజు మాట్లాడుతూ సంక్రాంతి రోజుల్లో కోళ్లకు క త్తులు కట్టి పందేలు నిర్వహిస్తూ ఉంటారని, ఈ కారణంగా అనేక కుటుం బాలు రోడ్లపాలు అవుతున్నాయన్నారు. కోడి పందేలు, గుండాట, పేకాట తది తర జూదాలు ఆడేవారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నా రు. సంక్రాంతి పర్వదినాల్లో ముగ్గులపోటీలు, కబడ్డీ, క్రికెట్, వాలీబాల్, స్లో సైక్లింగ్ తదితర పోటీలు నిర్వహించుకుంటూ కుటుంబ సభ్యులతో ఆనం దంగా గడపాలన్నారు. ఏలూరు డీఎస్పీ డాక్టర్ ఒ.దిలీప్ కిరణ్ మాట్లాడుతూ జూదాలు ఆడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో సీసీ ఎస్ డీఎస్పీ పైడేశ్వరరావు, దిశ డీఎస్పీ కేవీ సత్యనారాయణ, వన్‌టౌన్ సీఐ బాలరాజాజీ, టూటౌన్ సీఐ ఆది ప్రసాద్, రూరల్ సీఐ అనసూరి శ్రీనివాస రావు, వన్‌టౌన్ ఎస్‌ఐలు కె.నాగేంద్ర ప్రసాద్, రామకృష్ణ, టూటౌన్ ఎస్‌ఐ ఎన్‌ఆర్ కిషోర్‌బాబు, త్రీటౌన్ ఎస్‌ఐలు ఎం.వెంకటరమణ, బీఎస్‌డీఆర్ ప్రసా ద్, రూరల్ ఎస్‌ఐ చావా సురేష్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.