-
-
Home » Andhra Pradesh » West Godavari » westgodavari aqua raythu
-
కొత్త ఏడాదిలో విద్యుత్ భారం తప్పదా..?
ABN , First Publish Date - 2020-12-31T05:14:03+05:30 IST
విద్యుత్ పంపిణీ సంస్థలు నెలరోజుల క్రితం ఆక్వా రం గంలో కొన్ని విభాగాలకు కేటగిరీలను మార్పు చేస్తూ ప్రతిపాదనలు చేశాయి.

ఆక్వా రైతుల్లో ఆందోళన
భీమవరం, డిసెంబరు 30 : విద్యుత్ పంపిణీ సంస్థలు నెలరోజుల క్రితం ఆక్వా రం గంలో కొన్ని విభాగాలకు కేటగిరీలను మార్పు చేస్తూ ప్రతిపాదనలు చేశాయి. ఇవే అమ లైతే కొత్త ఏడాదిలో తమకు విద్యుత్ భారం తప్పదని ఆక్వా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆక్వా రంగానికి కీలకమైన రొయ్య పిల్లల తయారీ కేంద్రాలకు, ఫీడ్ తయారు చేసే సంస్థలకు పరిశ్రమల కేటగిరీలోకి మార్పు చేస్తూ ప్రతిపాదన చేశారు. చిన్న స్థాయిలో మిక్సింగ్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుని చాలా మంది రైతులు, నిరుద్యోగులు వీటిపై ఆధారపడి ఉపాధి పొందుతున్నారు. ప్రస్తుతానికి ఎల్‌టీ కేటగిరి–5సిలో రొయ్యల చెరువులకు ఇచ్చిన విధంగానే వీరికీ విద్యుత్ సబ్సిడీ ఇస్తున్నారు. దీంతో యూనిట్ 1.80 పైసలకే తక్కువ ఖర్చుతోనే సీడు, ఫీడులను అందజేయగలుగుతున్నారు. తాజా సిఫార్సుల ప్రకారం యూని ట్‌కి రూ.7 వరకూ వసూలు చేస్తారు. ఇదే జరిగితే సీడు, ఫీడ్ ధరలు 200 రెట్లుకు పైగా పెరిగే అవకాశం ఉందని ఆక్వారైతులు ఆందోళన చెందుతున్నారు.