-
-
Home » Andhra Pradesh » West Godavari » westgodavari abolish go 77
-
జీవో నెంబరు 77ను రద్దు చేయాలి
ABN , First Publish Date - 2020-12-29T05:26:14+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జివో నెంబరు 77ను రద్దు చేయాలని కోరుతూ సోమవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదుట పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేశారు.

బుట్టాయగూడెం, డిసెంబరు 28: రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జివో నెంబరు 77ను రద్దు చేయాలని కోరుతూ సోమవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదుట పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేశారు. జిల్లా కోశాధికారి బి.వినోద్ మాట్లాడుతూ ఎయిడెడ్, అన్‌ఎయిడెడ్ కళాశాలల పీజీ విద్యార్థులకు ఉపకార వేతనాలు, బోధన ఫీజులు, విద్యాదీవెన, వసతిదీవెన పథకాలను రద్దు చేస్తూ ప్రభుత్వం జీవో నెంబరు 77ను తీసుకువచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో పేద విద్యార్థులు చదువులకు దూరం అవుతారని పేర్కొన్నారు.
నల్లజర్ల: జీవో నెంబర్ 77ను రద్దు చేసి అర్హులైన విద్యార్థులకు జగనన్న వసతి, విద్యా దీవెన వర్తింపజేయాలని టీఎన్‌ఎస్‌ఎఫ్ రాజమహేంద్రవరం పార్లమెంట్ అధ్యక్షుడు పాతూరి సహృదయ్ అన్నారు. సోమవారం నల్లజర్ల జీవో నెం77పై నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహాం వద్ద నిరసన వ్యక్తం చేసి జీవో ప్రతులను దహనం చేశారు.