సామూహికంగా తెల్లదోమను నివారించాలి
ABN , First Publish Date - 2020-12-17T05:30:00+05:30 IST
ఆయిల్ పామ్ తోటలో వచ్చే తెల్లదోమను రైతులు సామూహికంగా నివారించాలని వైయస్‌ఆర్ యూనివర్శిటి వీసీ టి.జానకీరామ్ అన్నారు.

వైయస్‌ఆర్ యూనివర్శిటి వీసీ జానకీరామ్
నల్లజర్ల, డిసెంబరు 17: ఆయిల్ పామ్ తోటలో వచ్చే తెల్లదోమను రైతులు సామూహికంగా నివారించాలని వైయస్‌ఆర్ యూనివర్శిటి వీసీ టి.జానకీరామ్ అన్నారు. ప్రకాశరావుపాలెంలో త్రీఎఫ్ ఆయిల్ పామ్, ఉద్యాన శాఖ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం ఆయిల్ పామ్ రైతులకు క్షేత్రస్థాయి అవగాహన కల్పించారు. తెల్లదోమ నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలు తెలియజేశారు. సమగ్ర యజమాన్య పద్ధతులు, పసుపు రంగు జిగురు అట్టలు ఏర్పాటు చెయ్యడం, ఇసారియా శిలీంద్ర ద్రావణం పిచికారి చేయడం, మిత్రపురుగులను విడుదల చేయడం వంటి పద్ధతులను రైతులు పాటిస్తే పూర్తి స్థాయిలో తెల్లదోమ నివారణ చేయడం సాధ్యపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పరిశోధన సంచాలకులు ఆర్‌వీఎస్‌కే రెడ్డి, ఉద్యానశాఖ డిప్యూటి డైరెక్టర్ సుబ్బారావు, త్రీఎఫ్ డీజీఎం విజయప్రసాద్ పాల్గొన్నారు.