‘చదవడం మాకిష్టం’తో చదువు పట్ల శ్రద్ధ పెంపు

ABN , First Publish Date - 2020-12-14T04:37:06+05:30 IST

ప్రతి విద్యార్థి ‘చదవడం మాకిష్టం’ కార్య క్ర మాన్ని సద్వినియోగించు కోవాలని, ఈ కార్యక్రమం వల్ల విద్యార్థుల్లో చదువు పట్ల శ్రద్ధ పెరుగుతుందని సర్వశిక్ష అభియాన్‌ రాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్‌ మేరీ చంద్రిక అన్నారు.

‘చదవడం మాకిష్టం’తో చదువు పట్ల శ్రద్ధ పెంపు
కార్యక్రమంలో పాల్గొన్న సర్వశిక్ష అభియాన్‌ రాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్‌ మేరీ చంద్రిక

సర్వశిక్ష అభియాన్‌ రాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్‌  మేరీ చంద్రిక

దెందులూరు, డిసెంబరు 13: ప్రతి విద్యార్థి ‘చదవడం మాకిష్టం’ కార్య క్ర మాన్ని సద్వినియోగించు కోవాలని, ఈ కార్యక్రమం వల్ల విద్యార్థుల్లో చదువు పట్ల శ్రద్ధ పెరుగుతుందని సర్వశిక్ష అభియాన్‌ రాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్‌  మేరీ చంద్రిక అన్నారు.  దెందులూరు గ్రంథా లయంలో ఏఎంవోలు భాస్కర్‌రాజు, రామారావు, జాన్‌ ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలో ఆదివారం ‘చదవడం మాకిష్టం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ గ్రంథాలయంలో విద్యార్థులు పుస్తకాలను ఎలా సద్వినియోగించుకోవాలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో గ్రంఽథపాలకులు ఝాన్సీరాణి, హెచ్‌ఎం గారపాటి కనకదుర్గ సునీత, గ్రంథపాలకుడు గుళ్ళపూడి వెంకటేశ్వర రావు విద్యార్థులు పాల్గొన్నారు. పోతునూరు గ్రంథాలయంలో గ్రామదీప్‌ స్వచ్ఛంద సంస్థ చైర్మన్‌ వెలమాటి మనోహరి ఆధ్వర్యంలో ‘చదవడం మాకిష్టం’ కార్యక్రమం నిర్వహించారు. గ్రంథాలయశాఖ అధికారి ఎన్‌బీ అనిల్‌కుమార్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-14T04:37:06+05:30 IST