-
-
Home » Andhra Pradesh » West Godavari » west godavari villeges alert
-
గ్రామాల్లో అలర్ట్
ABN , First Publish Date - 2020-12-11T05:25:50+05:30 IST
ఏలూరులో అంతుచిక్కని వ్యాధి భయ పెడుతున్న నేపథ్యంలో మండల అధికారులు అప్రమత్తమయ్యారు.

మంచినీటి శాంపిల్స్ సేకరణ
ఏలూరు రూరల్, డిసెంబరు 10: ఏలూరులో అంతుచిక్కని వ్యాధి భయ పెడుతున్న నేపథ్యంలో మండల అధికారులు అప్రమత్తమయ్యారు. ఆయా గ్రామాల్లో సరఫరా చేస్తున్న తాగు నీటి స్వచ్ఛతను ఎప్పటికప్పుడు పరీక్షించేలా చర్యలు చేపట్టారు. మండలంలో 42 ఓవర్ హెడ్ ట్యాంకులున్నాయి. ఇక్కడ నీటిని ఫ్రీ రిజెడ్యుల్ క్లోరిన్ (ఎఫ్‌ఆర్‌సీ) ప్రక్రియ ద్వారా శుద్ధి చేసి తాగడానికి అనువుగా మార్చిన తర్వాత కుళాయిలకు సరఫరా చేస్తున్నారు. ఈ సమ యంలో ఎక్కడైనా కలుషితమైన ఎఫ్‌ఆర్‌సీ ద్వారా అందులో ఉన్న సూక్ష్మ జీవులు, ఇతర లోహాలను నశింపచేసేందుకు అవకాశం ఉంది. అయితే అక్కడ నుంచి నీరు కుళాయి పాయింట్‌కు చేరే సమయంలో కలుషితమయ్యేందుకు ఆస్కారం ఉంది. కలుషితమైన నీటిని తాగడం వల్ల ప్రజలు డయేరియా, మూ ర్చ, తల, కళ్ళు తిరగడం వంటి రుగ్మతలకు గురికావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మండలంలోని ఆర్‌డబ్ల్యూఎస్, మండల శాఖ అధికారులు అప్ర మత్తమై ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టారు. గ్రామీణ ప్రజలకు ఓవర్ హెడ్ ట్యాంక్‌ల ద్వారా సరఫరా అవుతున్న నీటి స్వచ్ఛతను ఎప్పటికప్పుడు పరీక్షించేందుకు శాంపిల్స్‌ను సేకరిస్తు న్నారు. ఓవర్‌హెడ్ ట్యాంక్ తాగునీరు అందించే మంచినీటి చెరువులతోపాటు వివిధ ప్రాంతాల్లో కుళాయి పాయింట్ల వద్ద శాంపిల్స్‌ను సేకరిస్తున్నారు. సరఫరా అవుతున్న నీటిలో క్లోరిన్ శాతం నిర్దేశిత స్థాయిలో ఉందా.. లేదా.., సూక్ష్మజీవుల అవశేషాలు ఉన్నాయా లేవా అనేది పరిశీలిస్తున్నారు. ఎక్కడైనా అనుమానం కలిగించేలా నివేదిక వస్తే ఆ పాయింట్‌కు నీటిని సరఫరా చేసే ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి నీటిని నిలిపి వేస్తామని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు తెలిపారు. నీటి స్వచ్ఛత విషయంలో అప్రమత్తంగా ఉండడంతో పాటు పైపులైన్ల లీకేజీ జరగకుండా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నట్టు తెలిపారు.