వైసీపీ జెండా రంగులు తొలగించాలి

ABN , First Publish Date - 2020-12-20T04:53:26+05:30 IST

ప్రభుత్వ కార్యాలయానికి వైసీపీ జెండా రంగులను తొలగించాలని సుప్రీంకోర్టు ఆదేశించినా మార్చకపోవడం విచారకరమని జనసేన నాయకులు పేర్కొన్నారు.

వైసీపీ జెండా రంగులు తొలగించాలి
వినతిపత్రం ఇస్తున్న జనసేన నేతలు

వీరవాసరం, డిసెంబరు 19: ప్రభుత్వ కార్యాలయానికి వైసీపీ జెండా రంగులను తొలగించాలని సుప్రీంకోర్టు ఆదేశించినా మార్చకపోవడం విచారకరమని జనసేన నాయకులు పేర్కొన్నారు. వారం రోజుల్లోగా రంగులు మార్చని పక్షంలో హైకోర్టులో కోర్టు దిక్కరణ పిటీషన్‌ ధాఖలు చేస్తామని జనసేన కార్యకర్తలు హెచ్చరించారు. తహసీల్దార్‌ సుందరరాజుకు శనివారం వినతిపత్రం ఇచ్చారు. ప్రజాధనంతో నిర్మితమైన ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు తొలగించాలని హైకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. ఇప్పటికీ పలు ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు మార్చకపోవడం కోర్టు ధిక్కారమేనని జనసేన నాయకులు అన్నారు. వారం రోజులలోగా కార్యాలయాలకు రంగులను మార్చాలని డిమాండ్‌ చేశారు. మండల జనసేన అధ్యక్షుడు గుండా రామకృష్ణ, గుండా శ్రీనివాసబాబు, కెశ్రీనివాస్‌, బి మణికంఠ, కొల్లా వెంకట్‌, వడ్డే రక్షణకుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Read more